అక్కినేని నాగార్జున హీరోగా ఆశిశోర్ సోలోమన్ దర్శకత్వంలో వైల్డ్ డైగ్ అనే చిత్రంలో నటించాడు. దియా మీర్జా, సయామి ఖేర్ లు హీరోయిన్స్ గా నటించారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి. కే అన్వేష్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందింది. షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదల విషయంపై పూర్తి వివరాలు తెలియనున్నాయి.
ఈ నేపథ్యంలో నాగార్జున ప్రవీణ్ సత్తార్ తో ఓ సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నాడు. ఇప్పటికే కథను వినిపించి ఓకే అనిపించుకున్న దర్శకుడు నాగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈనెల చివరిలోగా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళుతుంది. నిజానికి ఈ చిత్రం, నవంబర్ లోనే సెట్స్ పైకి వెళ్ళాలిసి ఉంది. కానీ కరోనా కారణంగ పోస్ట్ పోన్ అవ్వుతు వచ్చింది.
మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లో షూట్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఊటీ బయలుదేరి వెళ్ళుతుంది. అక్కడే ఓ రెండు నుండి మూడు వారాల పాటుగా షూటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ కోసం లండన్ బయలు దేరి వెళ్లనున్నదని సమాచారం. ఈ చిత్రంలో నాగ్ కోసం హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నాడు దర్శకుడు. రాజశేకర్ తో గరుడవేగ చిత్రం తీసి మంచి హిట్టు కొట్టాడు.
నాగ్ తో సినిమా పూర్తి చేసిన వెంటనే బ్యాట్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ బయోపిక్ ను తెలుగు, హింది బాషలో తీయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేశాడు. ఈ క్రమంలో నాగ్ మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒక్కటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రం. విక్రమ్ కే కుమార్ తో మనం చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడు.