రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ కు ముందు ఈ చిత్రం యొక్క షూటింగ్ ముంబై లో మొదలైంది. అక్కడే ఓ భారీ షెడ్యూల్ ను చిత్రీకరించారు. కరోనా వైరస్ కారణంగ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను విదించడంతో తొమ్మిది నెలల పాటు షూటింగ్ పోస్ట్ పోన్ అయింది. షూటింగులకు కేంద్ర నుండి అనుమతులు లభించడంతో పూరీ తన లైగర్ చిత్రంను తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
తాజా సమాచారం మేరకు ఈ నెల 11 నుండి రేగ్యూలర్ షూటింగ్ జరగనున్నది. అందుకే లైగర్ టీమ్ ముంబయి బయలుదేరి వెళ్లింది. ఇక అక్కడే ఓ లాంగ్ షెడ్యూల్ ను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది. ఈ చిత్రానికి ఈమె నటించిన పాత్ర హైలెట్ అవ్వనున్నదని సమాచారం. దర్శకుడు పురిజగన్నాథ్ ఆమె పాత్రను చాలా చక్కగా చూపించనున్నట్లుగా తెలుస్తుంది.
రౌడీ స్టార్ కి జోడీగా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాని పూరీ కెనెక్ట్ మరియు ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై ఛార్మి, కరణ్ జోహర్ లు నిర్మిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ , కిక్ బాక్సింగ్ మిక్సింగ్ కలిసి స్పొర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం నుండి విజయ్ దేవరకొండ లుక్ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో హిట్టు కొట్టి మంచి ఫామ్ లో ఉన్న పూరీ తన తదుపరి సినిమాగా లైగర్ చిత్రాని రూపొందిస్తున్నాడు. కావున ఈ చిత్రం మంచి విజయం సాదిస్తుందని విజయ్ మరియు పూరీ లు గట్టి నమ్మకంతో ఉన్నారు.