టాలీవుడ్ బ్యాచిలర్ హీరోలలో చాలా మంది ఈ లాక్ డౌన్ సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. అందులో నితిన్, నిఖిల్, రానా, లు ఉన్నారు. ఇంకా కొంత మంది యువ హీరోలు మిగిలారు అందులో ముఖ్యులు ప్రభాస్ ఒక్కడు. నాలుగు పదుల వయసు మీద పడుతున్న పెళ్లి విషయంపై మాత్రం నోరు మెదపడం లేదు. ఇదిగో, అదిగో ప్రభాస్ చేసుకోబోయే అమ్మాయి అని వార్తలు వస్తున్న ఇంతవరకు వారి కుటుంబం నుండి ఎలాంటి ప్రకటన మాత్రం లేదు.
మిర్చి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ప్రభాస్ నోట పెళ్లి మాట మాత్రం రాలేదు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ పెళ్లి అంటూ… ఇలా ఓ సినిమా తర్వాత మరో సినిమా.. ప్రభాస్ పెళ్లి అంటూ గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనుష్క శెట్టి తో ప్రభాస్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికాను హీరో ప్రభాస్ కు ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చిన అవన్నీ గాలి వార్తలు గానే మిగిలాయి.
ప్రభాస్ పెళ్లి న్యూస్ సోషల్ మీడియాలో నెల, రెండు నెలల కు ఓసారి వినిపిస్తూనే ఉంది. అందుకే ప్రభాస్ ఓ కీలక నిర్ణయం తీసుకునట్లుగా తెలుస్తుంది ! తాజాగా మరో న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్ నుండి వినపడుతుంది.. ఓ బిజినెస్ మ్యాన్ కూతురును ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంట. కృష్ణం రాజు సతీమణి కుటుంబం కు చెందిన అమ్మాయి అని తెలుస్తుంది.
వారి సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లా అని అమెరికాలో వారికి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ కూడా ఉన్నట్లుగా సమాచారం. అలాగే వేరే ఇతర బిజినెస్ లు కూడా ఉన్నాయి అంట. ప్రభాస్ పెళ్లికి సంబందించి పనులు కూడా చకచక గా జరుగుతునట్లుగా సమాచారం. ఇక ఆ అమ్మాయినే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటున్నారు. ఈ సమ్మర్ లోనైనా ప్రభాస్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు అవ్వుతాడ లేక సినిమాలతో మళ్ళీ బిజీ అవ్వుతాడ అనేది తెలియాలిసి ఉంది.