సినిమా వేగం పెరుగుతున్న కొద్ది కొత్త ట్రెండ్స్ తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్, మల్టీస్టారర్ ల ట్రెండ్ నడుస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ఈ ట్రెండ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన హీరోలు సోలోగా ఎంట్రీ లు ఇవ్వడం మొదలు పెట్టారు. చాలాకాలం వరకు అదే ట్రెండ్ కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడువస్తున్న యువ హీరోలు ఇగోలకు ఫుల్ స్టాప్ పెట్టి మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆశక్తి చూపిస్తున్నారు.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో ఎన్టిఆర్, రామ్ చరణ్ లు హీరోలు గా నటిస్తున్నారు. వెంకటేష్- పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ -మంచు మనోజ్ లు ఇలా ఎన్నో కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. తాజాగా అల్లు అర్జున్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ సినిమా త్వరలో రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ వినడానికి ఎంత సంతోషం గా ఉంది. అల్లు అర్జున్, విజయ్ అభిమానులు సైతం ఈ కాంబినేషన్ లో సినిమా రావాలని కోరుకుంటున్నారు. ఎందుకు అంటే అల్లు అర్జున్ సినిమాకు సంబందించిన ఏ న్యూస్ వచ్చిన మన రౌడీ స్టార్ వెంటనే స్పందిస్తాడు. అల పరస్పరం ఒక్కరి సినిమాల గురించి మరొకరు స్పందిస్తూనే ఉంటారు.
ఆ మధ్య విజయ్ తన రౌడీ బ్రాండ్ కు సంబందించి వచ్చిన కొత్త కలెక్షన్స్ ను అల్లు అర్జున్ కు గిఫ్ట్ గా పంపించాడు. ఇలా ఒక్కరి గురించి ఒక్కరికి మంచి అవగాహన ఉంది. వీరిద్దరిని తెరపైన చూపించాలని యాత్ర సినిమా దర్శకుడు మహి వి రాఘవ భావిస్తున్నాడు అంట. అందుకే ఆ దిశగా వీరిని కలిసి ఓ స్టోరీ గురించి చర్చించినట్లుగా సమాచారం. అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారనున్నాడు. విజయ్ దేవరకొండ కూడా లైగర్ సినిమాను బాలీవుడ్ లోకి తీసుకుపోతున్నాడు. కావున ఈ చిత్రంతో రౌడీ కూడా పాన్ ఇండియా హీరోగా మారుతాడు. మరి వీరిద్దరు కలిసి తెరపై కనిపిస్తే ఇంకేమైనా ఉందా రికార్డ్స్ ఎక్కడికక్కడ బ్రేక్ అవ్వాలిసిందే. వీరి అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. విజయ్-బన్నీల మల్టీస్టారర్ సినిమాపై మహి వి. రాఘవ ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తాడో చూడాలి.