రామ్ పోతినేని ప్రస్తుత గెటప్ చూస్తే ఆయన సినిమాలనుండి బ్రేక్ తీసుకున్నారా ఏమిటి అనే సందేహం కలగక మానదు. నుదుటిపై తెల్లటి మూడు నామాలు చేతులకు కూడా అవే నామాలతో మెడలో రుద్రాక్ష మాలా ఒంటిపై కషాయం డ్రెస్స్ చూస్తే శివమాల తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి మాల ధరించిన వారు 42 రోజులు నిష్టతో దీక్ష చేయాలి. కనుక ఆయన సినిమాల నుండి కాస్త రిలీఫ్ అయ్యేందుకు దీక్ష తీసుకునట్లుగా తెలుస్తుంది.
ఈ విషయాని రామ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు… స్పెడ్స్ పెట్టి మాల ధరించిన ఫోటోతో సెల్ఫి తీసుకొని ఓం నమ శివాయ ఓ చిన్న బ్రేక్ ఐ విల్ బి బ్యాక్ లవ్ రాపో అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం రామ్ ఫోటో పై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో పై విపరీతమైన కామెంట్స్ లైక్ లు రీ ట్వీట్స్ తో ఫ్యాన్స్ అదరగొడుతున్నారు. కొంతమంది మాల ధరించినప్పుడు ఇలాంటివి అవసరమా అంటూనే మరికొంతమంది మాత్రం ఓం నమ శివాయ అంటూ సఫోర్ట్ చేస్తున్నారు.
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో గడిచిన ఏడాది సూపర్ హిట్టును కొట్టాడు. కిషోర్ తిరుమల డైరెక్షన్లో రెడ్ సినిమాతో ఈ ఏడాది కూడా మంచి సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఈ చిత్రంలో రామ్ డ్యూయల్ రోల్ లో నటించాడు. నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత ఐయ్యర్ లు హీరోయిన్స్ గా నటించారు. రామ్ తదుపరి సినిమా విషయంలో ఎలాంటి క్లారీటి లేదు. రామ్ తన దీక్షా పూర్తి చేసిన తర్వాత సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా కు కూడా కాస్త బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.