అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ. ఆ తర్వాత గీత్ గోవిందం, టాక్సీవాలా సినిమాలతో సూపర్ సక్సెస్ లను దక్కించుకున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో నిరాశ పరిచిన ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ను అందుకోవాలని చూస్తున్నాడు.
లాక్ డౌన్ కు ముందు ఈ చిత్రం యొక్క షూటింగ్ ఎక్కువబాగం ముంబై లో జరిగింది. లాక్ డౌన్ కారణంగ తొమ్మిది నెలల పాటుగా సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. కరోనా నుండి కేంద్ర అనుమతులు ఇస్తున్న తరుణంలో అందరూ కూడా తమ తమ ప్రాజెక్ట్స్ ను సెట్స్ పైకి తీసుకెళ్ళుతున్నారు. ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్ లైగర్ చిత్రాని సెట్స్ పైకి తీసుకు రాబోతున్నాడు. వచ్చే వారం నుండి ఈ చిత్రం ఎక్కడి నుండి షూటింగ్ ఆపేశారో అక్కడి కెళ్ళి షూటింగ్ జరపనున్నారు. ఆల్రెడీ ముంబై కి లైగర్ టీమ్ బైలుదేరింది.
ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. తాజా సమాచారం మేరకు విజయ్, అనన్య లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ను ప్రదానాంశంగా చేసుకొని స్పొర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నాడు పూరీ. సెకండ్ షెడ్యూల్ తో దాదాపుగా సినిమా పూర్తి అవ్వుతుంది. విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి సినిమాపై భారీ అంచనాలను తీసుకువచ్చాడు.
ఈ చిత్రం తెలుగుతో పాటుగా హిందీలోను రూపొందుతుంది. తెలుగులో ఛార్మి నిర్మిస్తుంటే బాలీవుడ్ లో ధర్మ ప్రొడక్షన్ పై కరణ్ జోహర్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్ రవితేజ తో ఓ సినిమా ప్లాన్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది