కేజిఎఫ్ చిత్రం సాదించిన విజయంతో దానికి సీక్వెల్ గా కేజిఎఫ్ 2 చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ యష్ లీడ్ రోల్ లో నటించాడు. శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
కేజిఎఫ్ పార్టీ 1 విడుదలైన అన్నీ బాషల్లోనూ రికార్డ్స్ క్రియేట్ చేసింది. అందుకే పార్టీ 2 కోసం ప్రేక్షకులు ఇగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య విడుదలైన టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచారు. టీజర్ ను చూసిన సినిమా లవర్స్ కూడా ఇక ఎప్పుడు ఈ చిత్రం విడుదల అవ్వుతూందా అని ఎదురుచూస్తున్నారు. వాళ్ళ వీక్ నెస్ ను మేకర్స్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే ఈ చిత్రం యొక్క థియేట్రికల్ రైట్స్ ఓ రేంజ్ రేట్స్ కు అమ్ముడు పోతున్నాయి.
ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ రేట్స్ ఆకాశాని తాకుతున్నాయి. ఫారెన్ కంట్రీస్ లో బొమ్మ పడాలంటే 80 కోట్లు చెల్లించాలిసిందే అని భీష్మించుకొని కూర్చున్నారు. ఆయన అంత రేటు పెట్టడానికి కూడా డిస్ట్రిబ్యూటర్లు వెనకాడటం లేదు. ప్రస్తుతం కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు బేరాలు సాగిస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారీటి రానున్నది.
ఈ చిత్రాని హేంబలే ఫిల్మ్స్ అదినేత విజయ్ కిరాంగధుర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఆధీర అనే పాత్రలో నటిస్తున్నాడు. రవీనా టాండన్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి రవి బశృర్ సంగీతం అందిస్తున్నాడు. జూలై 16 న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదల అవ్వుతుంది.