గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన సినిమా క్రాక్. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ ఏడాది జనవరి 14 న సంక్రాంతికి విడుదల అయింది. మాస్ మహారాజ్ కి మంచి విజయాని అందించింది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. ఈ చిత్రాని శ్రీ సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పై ఠాగూర్ మధు నిర్మించాడు.
క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని, ఠాగూర్ మధుపై నిర్మాత మండలి లో ఫిర్యాధు చేశాడు. అందుకు కారణం ఏమిటి అంటే క్రాక్ చిత్రానికి గాని ఇంకా 30 లక్షల రూపాయలు దర్శకుడు గోపిచంద్ మలినేని కి రావాల్సి ఉంది అంట. ఈ విషయంపై నిర్మాత ఠాగూర్ మధును సంప్రదిస్తే అయిన నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి తెలుగు చలన చిత్ర నిర్మాత మండలిని ఆశ్రయించాడు. క్రాక్ విడుదల అయిన తర్వాత చూద్దాం అని చెప్పిన నిర్మాత ఇప్పుడు మంచి విజయం సాదించిన, తనకు రావలిసిన బ్యాలెన్స్ అమౌంట్ గురించి ఎలాంటి సమదానం లేకపోయేసరికి దర్శకుడు ఆ పని చేయాలిసి వచ్చింది.
తనకు రావలిసిన రెమ్యూనరేషన్ ను ఇప్పించాలిసిందిగా నిర్మాత మండలిని కోరడం జరిగింది. ఈ విషయాపై విచారణ చేయడం మొదలు పెట్టింది. నందమూరి బాలకృష్ణ తో గోపిచంద్ మలినేని ఓ చిత్రం చేయబోతున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ కూడా కథను విని ఓకే చేసినట్లుగా తెలుస్తుంది. మే నెలలో వీరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్నది. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి డైర్క్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే తన నెక్స్ట్ సినిమాను మొదలు పెట్టనున్నాడు.