మమతా మోహన్ దాస్ ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా యమదొంగ సినిమాలో ప్రియమణి తో కలిసి సహా నటిగా నటించింది. ఈమె నటించింది తక్కువ సినిమాలే.. కానీ సింగర్ గా మాత్రం చాలా సినిమాలో పాడింది… తెలుగులోను చాలా హిట్స్ సాంగ్స్ పాడింది. తన డిఫ్ఫరెంట్ వాయిస్ తో ఎక్కువగా ఐటెమ్ సాంగ్స్ పాడింది.
తెలుగులో రెండు మూడు సంవత్సరాల పాటు ఆమె హవా సాగింది. ఆ తర్వాత మరల ఇంతవరకు ఆమె జాడే లేదు. ఇప్పట్లో హీరోయిన్స్ ఓ సినిమాలో కనిపిస్తే చాలు మరో సినిమాలో ఛాన్స్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి… అలాంటిది మమతా మోహన్ దాస్ మరల రీ ఎంట్రీ ఇస్తుంది. అది కూడా సైడ్ క్యారెక్టర్స్ కాదు.. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. అవును అది నిజమే.. దాదాపుగా 15 ఏండ్లు అవ్వుతుంది. అయిన తరగని అందంతో అంతే ఫ్రెష్ గా ఉంది. కోలివుడ్ లో ప్రభుదేవా హీరోగా ‘ఊమై విళిగల్’చిత్రంలో నటించింది. ఇదే సినిమా కాకుండా విశాల్ హీరోగా, ఆర్య విలన్ గా నటిస్తున్న ఎనిమీ చిత్రంలో నటిస్తుంది.
ఆమె అక్కడ మొదటి చిత్రం “శివప్పగారం” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో రాజమౌళి డైరెక్షన్ లో యమదొంగ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మంచు విష్ణు, నాగార్జున నటించిన కృష్ణార్జున చిత్రంలో నటించింది… ఆ తర్వాత హోమం, విక్టరి, చింతకాయల రవి, కింగ్, కేడి చిత్రాలో నటించి మలయాళ సినిమా ఇండస్ష్ట్రి కి వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడే సినిమాలో నటిస్తూ రానిస్తుంది.
ప్రస్తుతం తమిళ్ లో ఓ రెండు సినిమాలు, మలయాళం లో ఓ నాలుగు సినిమాల్లో నటిస్తుంది. …సింగర్ గా ఆమె పాడిన పాటలు ఇప్పటికి శ్రోతలను అలరిస్తున్నాయి. రాఖీ సినిమాలోని రాఖీ…రాఖీ..రాఖీ సాంగ్… శంకర్ దాదా జిందాబాద్ సినిమాలోని ఆకలేస్తే అన్నం పెడతా… యమదొంగ సినిమాలో ఒలమ్మి తిక్కరేగిందా సాంగ్… చందమామ సినిమాలో సక్కుబాయినే సాంగ్ ఇప్పటికి ఈ సాంగ్స్ అలరిస్తూ ఉంటాయి.