ప్రపంచ వ్యాప్తంగ కరోనా వైరస్ రావడంతో అన్నీ దేశాలు లాక్ డౌన్ పాటించాయి. ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయిపోయింది. కోవిడ్ ప్రభావం సినిమా ఇండస్ష్ట్రి పై కూడా పడింది. దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్ అన్నీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఆ సమయంలోని సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ పై విడుదల అవ్వుతు వచ్చాయి. ఈ మధ్యనే కేంద్ర అనుమతులు ఇవ్వడంతో తిరిగి షూటింగ్ లు వేగంగా జరుపుకుంటున్నాయి.
ఆ మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా విడుదల విషయాలో 50 పర్సెంట్ సిట్టింగ్ క్యాపాసిటీతో థియేటర్లకు అనుమతులు ఇచ్చింది. అయిన 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ తో సినిమాలు విడుదల చేయాలంటే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ భయపడుతున్నారు. ఎందుకంటే లాభాలు కంటే నష్టాలు ఎక్కువ వస్తాయి కావున. 100 శాతం ఆక్యుపెన్సీ తో అయితేనే సినిమా విడుదల చేసిన లాభాలు వస్తాయని భావిస్తున్నారు. అందుకే చాలా సినిమాలు సమ్మర్ లో విడుదల అవ్వుతున్నాయి.
ఆ సమయంలోగ 100 శాతం పర్మిషన్ వస్తుందని భావిస్తున్న తరుణంలో అంతకంటే ముందే తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుండి 100 శాతం సిట్టింగ్ క్యాపాసిటీ తో థియేటర్లకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కు విరుగుడుగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, జనాలు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కావున ఈ మేరకు తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దర్శకులు, నిర్మాతలు, తదితరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.