చాలా మంది హీరోయిన్స్ మొదట మోడల్ గా అడుగు పెట్టి సినిమాలో అవకాశాలు పట్టేసి ఓ సారి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటే చాలు ఇక ఆమె అంటే పడి చచ్చే ఫ్యాన్స్ తయారు అవ్వుతారు. సోషల్ మీడియాలో వీరి పేరుపై అక్కౌంట్స్ ఓపెన్ చేసి ఆమె ఫోటోలను నిత్యం షేర్ చేస్తూనే ఉంటారు. ఇలా చేసిన వీరికి ఏమి రాదు. కాకపోతే ఓ అభిమాని అని పేరు తప్ప ఏమి ఉండదు. అదే సెలబ్రేటి సోషల్ మీడియా లో అక్కౌంట్ ఓపెన్ చేస్తే ఆమె ఆ సదరు సోషల్ మీడియా అక్కౌంట్ నుండి డబ్బులు వస్తాయి అనే విషయం మీకు తెలుసా ?
అది ఎలా అంటే ఒక్కప్పుడు ఓ హీరో, హీరోయిన్ గురించి మనకు తెలియాలంటే కొన్ని నెలలు గాని సంవత్సరాలు గాని పట్టేది నేడు టెక్నాలజి అడ్వాన్స్ అయ్యింది. ప్రతి ఒక్కరు టెక్నాలజి ని ఉపయోగిస్తున్నారు. చాలా మంది బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ ఇంస్టా గ్రామ్ అనే సోషల్ మీడియా అక్కౌంట్ ను ఉపయోగిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అందులో అక్కౌంట్ ఉంది. అందులో హీరోలు గాని హీరోయిన్స్ గాని ఫోటో పోస్ట్ చేస్తే దానికి లైక్ లు కామెంట్స్ వస్తాయి. తద్వారా హీరోలు హీరోయిన్స్ లక్షలలో డబ్బులు సంపాదిస్తున్నారు ఇప్పుడు బాలీవుడ్ లో ఎవరు ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నారో చూద్దాం..
40 మిలియన్లు ఫాలోవర్స్ ఉన్న బాలీవుడ్ హాట్ చిక్ ప్రియాంకా చోప్రా ఒక్క ఫోటో షేర్ చేస్తే ఇంస్టా గ్రామ్ నుండి 1.87 కోట్లు వరకు వస్తాయి. బాలీవుడ్ బాద్షా షారుఖాన్ ఒక్క ఫోటో షేర్ చేస్తే 1.కోటి రూపాయలు వస్తాయి. దీపికా పదుకునె ఒక్క ఫోటో పోస్ట్ చేస్తే 1.05 కోట్లు వస్తాయి. అలియ భట్ కు ఒక్క ఫోటో పోస్ట్ చేస్తే 1 కోటి రూపాయలు వస్తాయి. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక్క ఫోటో షేర్ చేస్తే 50 లక్షల రూపాయలు వస్తాయి. షాహిద్ కపూర్ తను యాక్ట్ చేసిన ఒక్క ఫోటో షేర్ చేస్తే 30 లక్షల రూపాయలను ఇంస్టా నుండి వస్తాయి. ఒక్కసారి సెలబ్రేటి అయితే చాలా సినిమా నుండి మాత్రమే కాదు ఇలా సోషల్ మీడియా అక్కౌంట్స్ నుండి కూడా వారికి కోట్లల్లో ఆదాయం వస్తుంది.