టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు ఎంతో మంది హీరోయిన్స్ వెళ్ళారు. ఇప్పటికీ చాలా మంది అక్కడ స్టార్ నటీమణులు గా రానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాప్సీ కూడా తెలుగు సినిమా నుండి హిందీ సినిమా కు తన ప్రయాణం కొనసాగించింది. ప్రస్తుతం అక్కడ లూప్ లాపేట అనే చిత్రంలో నటిస్తుంది, ఫ్యామిలీ అండ్ కామిడీ థ్రిలర్ గా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి ఆకాష్ భాటియా దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుండి తాప్సీ తన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఈ లుక్ అందరిని ఆలోచింప చేసే విదంగా ఉంది.
ఒక మురికి టాయిలెట్ లో కూర్చొని చేతిలో పేపర్ ను పట్టుకొని గ్రీన్ టి షర్ట్ వేసుకొని, బ్లాక్ షార్ట్ వేసుకొని టాయ్లెట్ పై మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంది. ఈ ఫస్ట్ లుక్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మరోసారి తాప్సీ ఆకట్టుకోవడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తప్పడ్ సినిమా మాదిరి లూప్ లాపేట కూడా ఆకట్టుకుంటుందని అంటున్నారు.
ఈ విషయంపై తాప్సీ ట్విటర్ లో ఇలా రాసుకొచ్చారు… “కొన్ని సార్లు జీవితంలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలిసి వస్తుంది. నేను ఇక్కడ ఎలా ఉన్నాను… నేను అదే ఆలోచిస్తున్నాను.. నేను అనేది జీవితంలో జరిగే గందరగోళం గురించి… హాయ్ నేను సవి… క్రేజీ రైడ్ కి స్వాగతం అంటూ చిత్రం గురించి చెప్పే ప్రయత్నం చేసింది. లూప్ లాపేట లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది. తాప్సీ సినిమా విషయానికి వస్తే మిథాలీ రాజ్ బయో పిక్ రష్మి రాకెట్ అనే చిత్రంలో నటిస్తుంది. తమిళ్ లో విజయ్ సేతుపతి తో ఓ చిత్రంలో నటించనున్నది.