కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ రీసెంట్ గా తన 35 వ పుట్టినరోజు వేడుకను తన కొత్త బోయ్ ఫ్రెండ్ తో జరుపుకుంది. ఈ సందర్భంగా వారిద్దరు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి. శృతి హాసన్ తన బోయ్ ఫ్రెండ్ ను రెండు చేతులతో గట్టిగా పట్టుకొని టైట్ హగ్ తో దిగిన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. ఇంతకు ఎవరు ఆ బోయ్ ఫ్రెండ్ అని నేటిజెన్స్ ప్రశ్నిస్తున్నా ఆమె మాత్రం నోరు మెదపలేదు.
అయితే ఆమె గతంలో హీరో సిద్దార్థ్ తో చాలా సంవత్సరాలు డేటింగ్ చేసింది. ఆ విషయాని ఆమె అప్పుడు పబ్లిక్ గానే చెప్పింది. సిద్దార్థ్ తో కలిసి డేట్ కు వెళ్ళిన ఫోటోస్ ఇప్పుడు కూడా అంతర్జాలంలో దర్శనం ఇస్తూ ఉంటాయి. సిద్దార్థ్ తో బ్రేక్ అప్ చెప్పిన కొంతకాలానికే ఆమె మరో కొత్త బోయ్ ఫ్రెండ్ తో దర్శనం ఇచ్చింది. రష్యా కు చెందిన మైకేల్ కోర్స్ లే, ఇతనితో పెల్లివరకు వెళ్లింది. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు వీరిద్దరు అనుకున్నారు అంతా కానీ సడన్ గా బ్రేక్ అప్ అయ్యారు. ఈ విషయంలో శృతి హాసన్ చాలా డిప్రెషన్ లోకి వెళ్లింది.
ఈ మధ్యనే మరల తిరిగి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు లో రవి తేజ క్రాక్ చిత్రంతో ఈ ఏడాది సూపర్ హిట్టు కొట్టింది. కట్ చేసి చూస్తే కొత్త బోయ్ ఫ్రెండ్ తో ముంబై వీధుల్లో చేతిలో చేయి వేసుకొని తిరుగుతూ మీడియా కంటికి కనిపించారు. ఇంకా అంటే మీడియా లోతుగా దిగి అన్వేషించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో శృతి హాసన్ బోయ్ ఫ్రెండ్ గురుంచి చాలా విషయాలు బయటపడ్డాయి. శృతి హాసన్ కొత్త బోయ్ ఫ్రెండ్ పేరు సంతాను హజారికా ఇతను ఒక్క డూడ్లే ఆర్టిస్ట్, ఇల్లూస్ట్రైటర్ అంటే బుక్స్ కోసం పెయింటింగ్స్ వెస్తూంటాడు. అంటే కాదు గౌతి ఆర్ట్ ప్రాజెక్ట్ కి కొ ఫౌండర్ కూడా.
ఈ మధ్యం శృతి హాసన్ తన పుట్టిన రోజు వేడుకను సంతాను హజారికాతో జరుపుకుంది. ఈ సందర్భంగా ఆయన తన ఇంస్టా లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ బ్లాక్ లవ్ ఆర్ట్ సింబల్ ను కూడా జత చేసి స్టేటస్ గా పెట్టాడు. గౌతి మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో శృతి హాసన్ తన కొత్త బోయ్ ఫ్రెండ్ గురుంచి, అతనితో తన రిలేషన్ షిప్ గురించి మాట్లాడటానికి నిరాకరించింది. త్వరలో ఈ విషయంపై శృతి నుండి క్లారీటి రానున్నది.