తెలుగు సినిమా ఇండస్ష్ట్రి లో సెట్స్ పైన ఉన్న సినిమాలు దాదాపుగా అన్నీ రిలీజ్ డేట్స్ ను ప్రకటించాయి. అన్నీ సినిమాలు సమ్మర్ ను టార్గెట్ గా పెట్టుకున్నాయి. మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ ప్రస్తుతం దేవకట్ట దర్శకత్వంలో రిపబ్లిక్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. వరస విజయాలతో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. ఆటోనగర్ సూర్య, ప్రస్థానం సినిమాలతో మంచి విజయాలను అందుకున్నఈ దర్శకుడు ఇప్పుడు సాయి తో పోలిటికల్ నేపథ్యం కలిగిన చిత్రంను రూపొందిస్తున్నాడు.
హిందీలో సంజయ్ దత్ తో ప్రస్థానం తీసి అక్కడ బోల్తా కొట్టాడు. అందుకే కొంత గ్యాప్ తర్వాత సాయి తేజ్ తో సినిమా ప్లాన్ చేశాడు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ సిఎం పాత్రలో నటిస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో సాయి తేజ్ నటిస్తున్నాడు. జూన్ 4న ఈ చిత్రం విడుదల అవ్వుతుంది. ఈ చిత్రం విడుదల వారం కు ముందు అంటే జూన్ 28 బాలకృష్ణ బోయపాటి ల సినిమా విడుదల అవ్వుతుంది. రవితేజ ఖిలాడి చిత్రం కూడా అదే డేట్ లో రావడంతో వీరిద్దరి మధ్య పోటీ నెలకొన్నది.
ఇప్పటి వరకు విడుదల కు సిద్దంగా ఉన్న సినిమాలు ఒక్కరి తో ఒక్కరు పోటీ పడుతూ విడుదల చేసుకుంటున్నారు. ఏ ఒక్క హీరో కి కూడా సోలో డేట్ దొరకలేదు. ప్రస్తుతం సేఫ్ ప్లేస్ లో ఉన్నది మాత్రం సాయి తేజ్ రిపబ్లిక్ మూవీ అని చెప్పాలి. ఇంకా మునుముందు ఏమైనా సినిమాలు ఆ డేట్ లో రిలీజ్ అయితే మాత్రం చెప్పలేము. ఈ చిత్రంలో తమిళ నటి ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతానికి సాయి తేజ్ సేఫ్ గానే ఉన్నాడు. ఈ నేపథ్యంలో కార్తీక్ దండు దర్శకత్వంలో తన 15 వ చిత్రంను ప్రకటించాడు.