మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన నటుల్లో వరుణ్ తేజ్ ఒక్కడు. ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. డిఫరెంట్ సినిమాలు చేస్తూ నటుడిగా నిరూపించుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలోకలిగిన గని అనే చిత్రంలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్దు ముద్దుల ఈ చిత్రాని నిర్మిస్తున్నారు. వరుణ్ కి జోడీగా సాయి మంజ్రేకర్ నటిస్తుంది. ఈమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో దబాంగ్ 3 లో నటించింది.
గని చిత్రంతో కిరణ్ కొర్రపాటి దర్శకుడుగా టాలీవుడ్ కి పరిచయం అవ్వుతున్నాడు. ఈ చిత్రంలోని భారీ తారాగణం సినిమాపై అంచనాలను పెంచుతుంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. కన్నడ నటుడు ఉపేంద్ర, జగపతి బాబు లు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రకు నవీన్ చంద్ర ను తీసుకున్నారు. అరవింద సమేత చిత్రంతో ఆకట్టుకున్న ఈ నటుడు గని చిత్రంలో అవకాశం కొట్టేశాడు.
నవీన్ ఈ చిత్రంలో బాక్సర్ గా నటిస్తున్నాడు. వరుణ్ తేజ్, నవీన్ చంద్రల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాల ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తమిళ నటుడు ధనుష్ తో పటాస్ చిత్రంలో నవీన్ చంద్ర బాక్సర్ గా నటించాడు. ఈ చిత్రాని జులై లాస్ట్ లో విడుదల చేయాలని గని టీమ్ బావిస్తుంది. అందుకే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మే నెల నాటికి షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరుణ్ తేజ్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 అనే చిత్రంలో నటిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు.