నటనలో కమల్ తర్వాత ఆయన వారసుడు ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు చియాన్ విక్రమ్. ఆయన సినిమా కోసం 100 శాతం కష్టపడి పని చేస్తూ ఉంటాడు. ఆయన నటించిన సినిమాలు చూస్తే ఆ విషయం అర్థం అవ్వుతుంది. సినిమా కోసం తన బాడిని ఎంత కష్టపెటాడో ఐ సినిమా చూస్తే మనకు అర్థం అవ్వుతుంది. ఆయన వారసుడు దృవ్ విక్రమ్ సినిమాలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
తెలుగు దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రాని ఆదిత్య వర్మగా కోలివుడ్ లో రీమేక్ చేశాడు. ఈ చిత్రంలో దృవ్ విక్రమ్ హీరోగా నటించాడు. ఇక దృవ్ విక్రమ్ తన తదుపరి సినిమా విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఈసారి తండ్రి విక్రమ్ బాటలో ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం బయోపిక్ లు, ఆటలకు సంబందించిన సినిమాలు రాజ్యం ఏలుతున్నాయి. ఇప్పుడు దృవు విక్రమ్ కూడా స్పొర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమాలో నటించడానికి సిద్దం అవ్వుతున్నాడు.
ఇండియాలో క్రికెట్ కు ఎంత పేరు ఉందో అంతే రేంజ్ లో ఇప్పుడు కబడ్డి వస్తుంది. ఈ నేపథ్యంలో కబడ్డి ని ప్రధానం గా చేసుకొని ఓ చిత్రంలో నటించబోతున్నాడు. తమిళనాడు గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కబడ్డి ద్వారా ఎలా ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలుచుకున్నాడు అనే ఓ యువకుడి నిజమైన కథ ఆదారంగా ఈ చిత్రం రూపొందబోతుంది. ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. నా తండ్రి నుండి నేను అంకితభావంతో పని చెయ్యడం నేర్చుకున్నాను. సెల్వరాజ్, పా, రంజిత్ తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని పా. నీలం ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తండ్రి విక్రమ్ తో కలిసి కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.