కోలివుడ్ నటి శృతిహాసన్ ను సోషల్ మీడియాలో ఓ విషయంపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు అంట. ఇంతకు అది ఏమిటా అనుకుంటున్నారా. గతంలో (2017) ట్విట్టర్ ద్వారా శృతి హాసన్ ఇప్పుడప్పుడే కన్నడ సినిమాలు చేసే ఆలోచన లేదు భవిష్యత్తులో ఏమైనా ఛాన్స్ వస్తే ఆలోచిస్తాను. అలాగే కన్నడ దర్శకులుగాని, నిర్మాతలుగాని ఎవరు నన్ను సంప్రదించలేదు అని చెప్పడం జరిగింది.
ఈ విషయంపై కన్నడ ప్రేక్షకులు నేడు ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు అంటే కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ తో సలార్ అనే చిత్రంలో శృతి హాసన్ నటిస్తుంది. కన్నడ సినిమాలు చేయనని చెప్పి ఇప్పుడు కన్నడ దర్శకుడు డైరెక్షన్ లో ఎలా సినిమాలు చేస్తున్నావు అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శృతి హాసన్ కు ఎందుకు అంత పొగరు అంటూ మండిపడుతున్నారు. అసలు విషయం ఇది కాదు అని తెలుస్తుంది.
పొగరు సినిమాకు సంబందించిన ట్వీట్ అంటూ వార్తలు వస్తున్నాయి. నందకిశోర్ దర్శకత్వంలో ధృవ్ సార్జ హీరోగా పొగరు అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో మొదట శృతిహాసన్ ను తీసుకోవాలని సంప్రదింపులు కూడా జరిపారు అంట దర్శక, నిర్మాతలు. అయితే ఆమె అప్పుడు ఇప్పుడప్పుడే కన్నడ సినిమాలు చేసే ఆలోచనలో లేనట్లు చెప్పడమే. ఇప్పుడు ఆ విషయాని దృష్టిలో పెట్టుకొని సామాజిక మధ్యమల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై శృతి హాసన్ మౌనంగానే ఉంది. నెటిజెన్స్ ట్రోల్స్ పై శృతి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. శృతి హాసన్ లవ్ బ్రేక్ అప్ తర్వాత మరల సినిమాలపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది రవి తేజ క్రాక్ చిత్రంతో మంచి హిట్టు కొట్టింది. పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చిత్రంలో నటించింది.