దర్శకుడు కొరటాల శివ, మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఆచార్య.కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పూజ హెగ్డే కథానాయక గా నటిస్తుంది. కరోనా కారణంగ చిత్రం యొక్క షూటింగ్ చాలా ఆలస్యంగా మొదలైంది. కేంద్ర ఇచ్చిన అనుమతుల నేపథ్యంలో రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా నేడు ఈ చిత్రం నుండి టీజర్ ను విడుదల చేసింది.
మెగా ఫ్యాన్స్ నుండి సినిమా ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. టీజర్ తో పాటుగా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించింది. మే 13 న ప్రపంచ వ్యాప్తంగ ఈ చిత్రం విడుదల అవ్వుతుంది. ఈ విషయాని ఆచార్య అండ్ టీమ్ ట్విటర్ ద్వారా తెలియజేసింది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ లతో తండ్రి, కొడుకులు దుమ్ము లేపారు. ఇక టీజర్ ను విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచారు.
ఈ సమ్మర్ లో టాలీవుడ్ నుండి చాలా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. మెగా ఫ్యామిలీ నుండి మెగా స్టార్ చిరంజీవి సినిమా మొదట విడుదల అవ్వుతుంది. చిరంజీవి సినిమా విషయాలకు వస్తే.. మలయాళం మూవీ లూసిఫర్ చిత్రం తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు మోహన్ రాజ దర్శకత్వం వహిస్తున్నాడు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తమిళ మూవీ వేదాలమ్ తెలుగు రీమేక్ లో నాటించనున్నాడు. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఆచార్య చిత్రం పూర్తి అయిన వెంటనే ఈ చిత్రం సెట్స్ పైకి వెల్లుతుంది. రామ్ చరణ్ ఆచార్య తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఎన్‌టిఆర్ తో యాక్షన్ సన్నివేశంలో పోటీ పడుతున్నాడు.