అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రష్మిక నటిస్తుంది. సుకుమార్ టీమ్ ఈ చిత్రం యొక్క విడుదల తేదీని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఆగష్టు 13 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సగం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మిగతా సగ భాగానికి ఏడు నెలల సమయం ఉంది కావున పుష్ప కు ఆ రిలీజ్ టైమ్ సరిగ్గా సరిపోతుంది.
బన్నీ పుష్ప చిత్రం యొక్క రిలీజ్ డేట్ లాక్ చెయ్యడంతో మహేశ్ బాబు సర్కారు వారి పాట టీమ్ అయోమయంలో పడింది. ఈ చిత్రం ను మొదట ఆగష్టు లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగ షూటింగ్ కు వెళ్ళడం ఆలస్యం అయింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న హీరోల సినిమాలు విడుదల తేదీని ప్రకటిస్తుంటే మహేశ్ ఫాన్స్ కూడా సర్కారు వారి పాట నుండి రిలీజ్ అప్డేట్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్న సమయంలో పుష్ప ఆగష్టు నేలను లాక్ చేసుకుంది.
సర్కారు వారి పాట కు ఛాన్స్ లేకుండా పోయింది. జులై వరకు ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఆగష్టు లో విడుదల చేయాలని అనుకున్న టీమ్ కు పెద్ద షాకే తగిలింది. దాసర కు రిలీజ్ చేద్దాం అంటే రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం ఉంది. వినాయక చవితి కి రిలీజ్ చేద్దాం అనుకుంటే పవన్ సినిమా విడుదల అవ్వుతుంది. ప్రస్తుతానికి మహేశ్ కు మరో ఛాన్స్ లేదు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తేనే మంచిదని ట్రేడ్ వర్గాల అభిప్రాయం. మరి మహేశ్ అప్పటి వరకు ఆగుతాడ లేక మరో డేట్ ఏమైనా ప్రకటిస్తాడా చూడాలి అంటున్నారు.