మాస్ మహారాజ్ రవి తేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం క్రాక్. గతంలో డాన్ శ్రీను, బలుపు, వంటి చిత్రాలను తెరకెక్కించాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మంచి విజయం దక్కించుకుంది. ఏమాత్రం కలెక్షన్స్ తగ్గకుండా దూసుకుపోతుంది. క్రాక్ చిత్రానికి థియేటర్స్ పెంచుకుంటూ పోతున్నారు. ఈ చిత్రంలో రవి తేజ పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.
కీలక పాత్రలో సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ లు నటించారు. ముఖ్యంగా కట్టారి కృష్ణ పాత్రలో తమిళ దర్శకుడు సముద్రఖని ఆకట్టుకున్నాడు. ఆయన లవర్ గా జయమ్మ మెప్పించింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. స్రవంతి మూవీస్ పై ఠాగూర్ మధు నిర్మించాడు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంను బాలీవుడ్ లో రీమేక్ చెయ్యనున్నట్లుగా తెలుస్తుంది. సౌత్ సినిమాలు ఈ మధ్య నార్త్ లో సూపర్ హిట్టు గా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు తెలుగు సినిమాలు కూడా అక్కడ రీమేక్ అవ్వుతున్నాయి.
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ క్రాక్ చిత్రంపై ఇంట్రెస్ట్ చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో రవి తేజ పాత్రకు షాహిద్ ను బాగా ఆకర్షించినట్లుగా తెలుస్తుంది. అందుకే క్రాక్ రీమేక్ లో నటించాలను భావిస్తున్నాడు. ఆల్రెడీ విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం బాలీవుడ్ రీమేక్ లో షాహిద్ కపూర్ నటించాడు. ప్రస్తుతం తెలుగులో నాని నటించిన జెర్సీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ 5 న విడుదల అవ్వనున్నది. తెలుగు చిత్రాలపై ఆసక్తి చూపుతున్న ఈ హీరో కన్ను ఇప్పుడు క్రాక్ చిత్రంపై పడింది.