తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ చిత్రం తర్వాత సిరుతాయి శివ దర్శకత్వంలో అన్నాతై అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, నాయనతార కథానాయకలు గా నటిస్తున్నారు. దేశంలో లాక్ డౌన్ కు ముందు ఈ చిత్రం 70 పర్సెంట్ షూటింగ్ జరుపుకుంది. లాక్ డౌన్ తర్వాత రజినీకాంత్ తమిళ రాజకీయాల్లోకి రావాలని చూశాడు.
ఆ నేపథ్యంలోనే అభిమానులు అందరు సిద్దంగా ఉండాలి అంటూ పిలుపును కూడా ఇచ్చాడు. కానీ కొన్ని కారణాల వలన రాజకీయ ప్రవేశం నుండి తప్పుకున్నాడు. ఈ సందర్భంలోనే కరోనా భారీన పడి మరల తిరిగి కోలుకుంటున్నాడు. ఆరోగ్య సమస్యల నడుమ ఎలాంటి టెన్షన్స్ తీసుకోదలుచుకోలేదు. ప్రస్తుతానికి అయితే సినిమాలపైనే ఆయన ఫోకస్డ్ గా ఉన్నాడు.
అన్నాతై చిత్రబృందం ఈ చిత్రం యొక్క విడుదల తేదీని ప్రకటించింది. దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల అవ్వుతుందని ప్రకటించింది. దీపావళి కి అన్నాతై వస్తున్నాడు సిద్దం కాండి అంటూ ట్వీట్ చేసింది. ఈ చిత్రం తమిళం తో పాటుగా తెలుగు, కన్నడ, హిందీలో విడుదల అవ్వుతుంది. ఈ చిత్రం యొక్క మిగిలిన 30 పర్సెంట్ ఫిబ్రవరిలో తిరిగి షూటింగ్ జరుపుకొనున్నది.
ఈ చిత్రంను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిది మారన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఖుష్బు, మీనా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.