మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం రిపబ్లిక్ ఈ చిత్రం సాయి కి 14 వ చిత్రంగా దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కుతుంది. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. సినీ వర్గాల కథనం ప్రకారం ఆమె సిఎం గా నటిస్తుందని తెలుస్తుంది. రేపు జనవరి 26 రాజ్యాంగం అమలు లోకి వచ్చిన రోజు కావున దేశ వ్యాప్తంగ రేపు జాతీయ జెండాను ఎగరవేయ్యానున్నారు.
ఈ సందర్భంను పురష్కరించుకుని దర్శకుడు దేవకట్ట సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ పోస్టర్ ను విడుదల చేశాడు. సాయి వాయిస్ ఓవర్ ఇస్తూ “యువరానర్ ప్రజలు ఎన్నుకున్న రాజకీయనాయకులు, శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయ్యాని కాపాడే కోర్టు, ఈ మూడు గుర్రాలు ఒక్కరి తప్పు ఒక్కరు దిద్దుకుంటు క్రమబద్దంగా సాగినప్పుడే అది ప్రజస్వామ్యం అవ్వుతుంది, అది ప్రభుత్వం అవ్వుతుంది అదే అసలైన రిపబ్లిక్” అని భీకరమైన గొంతు తో ఆకట్టుకున్నాడు.
విడుదలైన కొద్ది నిమిషాలకే మెగా ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కెరీర్ లో కాస్త వెనుక పడినట్లుగా కనిపించిన ఆయన మరల వేగం పెంచాడు. వరసగా స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే హీరో సాయి ధరమ్ తేజ్ మరో చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి సుకుమార్ రైటింగ్స్ లో కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రంలో రాశి ఖన్న హీరోయిన్ గా నటించనున్నది. ఈ చిత్రాన్ని ఎస్విసిసి బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనున్నది.