1991 లో మెగా స్టార్ చిరంజీవి హీరోగా విజయ శాంతి హీరోయిన్ గా నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రంను విజయ బాపినీడు దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఈ చిత్రంను తీశాడు దర్శకుడు. ఇక ఈ చిత్రంలో చిరంజీవి కి అన్నయ్యలుగా మురలి మోహన్, శరత్ కుమార్ లు నటించారు.
ఈ చిత్రంలో రావు గోపాల్ రావు, ఆనంద్ రాజ్ లు ఏకాంబరం, కనకాంబరం అనే ప్రతి నాయకుడి పాత్రల్లో నటించారు. చిరంజీవి సినిమా కెరీర్ లో గ్యాంగ్ లీడర్ చిత్రం 100 రోజులు ఆడిన చిత్రంగా నిలుస్తుంది. ఈ చిత్రంలో అన్నదమ్ములుగా నటించిన మురళి మోహన్, శరత్ కుమార్, చిరంజీవి లు మరోసారి రీ యూనియన్ అయ్యారు అందుకు సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది, గ్యాంగ్ లీడర్ బ్రదర్స్ 1991 to 2021 అంటూ ట్రెండ్ అవ్వుతుంది.
ఈ ముగ్గురు ఒకేసారి కలుసుకుని నేటికీ 30 ఏండ్లు అవ్వుతుంది. ప్రస్తుతం చిరంజీవి తన 152 వ చిత్రం ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ ఆర్‌ఎఫ్‌సి లో జరుగుతుంది. అనుకోకుండా మురళి మోహన్, శరత్ కుమార్ లు చిరంజీవి ని కలుసుకున్నారంట ఈ విషయాన్ని మురళి మోహన్ చెప్పుకొచ్చాడు. రఘుపతి, రాఘవ, రాజారాం లు అనుకోకుండా కలుసుకోవడం చాలా సంతోషం గా ఉంది అంటున్నారు.
ఈ సందర్భంను, చిరంజీవి ఫోటో గ్రాఫర్ ను పిలిచి మరి ఫోటోను తీయించాడు అంట. చిరంజీవి ఈ మూమెంట్ ను బాగా ఎంజాయ్ కూడా చేశాడని సమాచారం. మురళి మోహన్ విషయాని వస్తే సినిమా తో టిడిపి పార్టీ లో కీలక నేతగా కొనసాగుతున్నాడు. శరత్ కుమార్ కూడా తమిళ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే కరోనా భారీన పడి కోలుకున్నాడు. చిరంజీవి యాస్ యూసువల్ గా సినిమాలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.