మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారికా వివాహం ను రాజస్తాన్ లోని ఉదయ్ విల్లాస్ లో అంగరంగ వైభవంగా చేశాడు. మెగా, అల్లు ఫ్యామిలీ ఈ వివాహ వేడుక వద్ద తెగ సందడి చేశారు. నిహారికా పెళ్లి విషయానికి సంబందించిన ఫోటోలు , వీడియో క్లిపింగ్స్ ను సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. నిహారికా చైతన్యల పెళ్లి జరిగి నెల్లన్నరా కావొస్తుంది. అయిన కానీ అందుకు సంబందించిన ఫోటోలు నిత్యం ఏదో ఓ రూపంలో సామాజిక మధ్యమాల్లో దర్శనం ఇస్తూనే ఉన్నాయి.
తాజాగా నిహారికా ఆరు నిమిషాలు ఉన్న తన పెళ్లి వీడియో ను ఇంస్టా లో పోస్ట్ చేసింది. ల్యాప్ టాప్ లో పెళ్ళికి సంబందించిన ఫోటోలు, వీడియో లు చూస్తూ బాగా ఎమోషనల్ అయింది. ఆమె తన కంట కన్నీరు పెట్టుకుంది. ఆ వీడియో లో ముఖ్యంగా మెగా, అల్లు ఫ్యామిలీ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిహారికా ను పెళ్లి కూతురు చేసిన అప్పటినుండి పెళ్లి అయ్యి తలంబ్రాల వరకు ఆ వీడియో ఉంది. చిరంజీవి కూతురు సుష్మిత నిహారికా బుగ్గన చుక్క పెడుతూ ఉంటే ఆమె ఆ సమయంలోనూ బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది.
ఆ తర్వాత చైతన్య తాళి కట్టే సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఒక్కరిపై ఒక్కరు తలంబ్రాలు పోసుకుంటూ తెగ ఎంజాయ్ చేశారు. అలాగే బిందె లో ఉంగరం వేసి ఇద్దరి చేతులు పెట్టి చెరో ఉంగరం దొరికించుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను ప్రేమతో తడుతున్నట్లుగా ఉన్న ఫోటో బాగా వైరల్ అవ్వుతుంది. మెగా ఫ్యాన్స్ ఆ ఫోటో చూసి తెగ సంబర పడిపోతున్నారు. నిహారికా తన పెళ్లి వీడియో ను మరోసారి షేర్ చేసి తెగ మురిసిపోతుంది.