మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షో నుండి తప్పుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ అయ్యారు. ఓ వైపు టివి షో చేస్తూ కొత్తవారని యంకరేజ్ చెయ్యడానికి స్టార్ట్ ఆఫ్ కామిడీని స్టార్ట్ చేశాడు. ఈ మధ్యనే తన కూతురు వివాహనంను ఘనంగా జరిపించాడు. ఈ సందర్భంగా ఆయన తన కూతురు గురించి కొన్ని వివరాలను తెలియజేశాడు.
పెళ్లి కాక ముందు నిహారికా తో అన్నీ విషయాలను షేర్ చేసుకునే వాడిని. ఆమె నాతో చాలా క్లోజ్ గా ఉండేది అన్నీ విషయాలను పంచుకునేది. తన అన్న వరుణ్ తో నిహారికా చనువ చాలా తక్కువ చాలా అల్లరి అమ్మాయి గా పెరిగింది. పెళ్లి తర్వాత నిహారికా తో తక్కువ మాట్లాడుతున్న మునుపు ఉన్న చనువు ఇప్పుడు లేదు. ముందు ఓ అబ్బాయి పుట్టిన తర్వాత అమ్మాయి కావాలి అనుకున్న అనుకున్నట్లుగానే అమ్మాయి పుట్టింది.
నాకు మొదటి నుండి కూడా అమ్మాయిలు అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే నిహారికా చాలా గారాబంగా పెంచుకున్నాం, నిహారికా కు పెళ్ళిచేసిన ఇక వరుణ్ కి చెయ్యాలిసి ఉంది. వరుణ్ ప్రేమ పెళ్లి చేసుకున్న, అరెంజ్ మ్యారేజ్ చేసుకున్నఅది వరుణ్ ఇష్టం కాకపోతే తనను అర్థం చేసుకునే అమ్మాయి వస్తే చాలా సంతోషం. అన్నాడు. చిరంజీవికి తమ్ముడు గా నాగబాబు పలు విజయవంతమైన సినిమాల్లో నటించాడు. తమ్ముడు పవన్ కళ్యాణ్ తో జనసేన పార్టీ లో కీలక నాయకుడిగా సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం జీ తెలుగు లో అదిరింది షో కి జడ్జ్ గా కొనసాగుతున్నాడు.