కమల్ హాసన్ నట వారసురాలిగా సినిమా లోకి వచ్చిన శృతి హాసన్ తెలుగు, తమిళ, మలయాళ బాషల్లో హీరోయిన్ గా రానిస్తుంది. మొదట ఈమె నటించిన చిత్రాలు ఫ్లాప్ ను దక్కించుకున్న ఆ తర్వాత వరస హిట్స్ తో దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో నే ఆమె రష్యా కు చెందిన మైఖేల్ కోర్సలే తో ప్రేమలో పడింది. చాలాకాలం వరకు వీరు డేటింగ్ చేసుకున్నారు.
త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు అనుకునేసరికి వారిద్దరు కొన్ని కారణాల వలన బ్రేక్ అప్ చెప్పుకున్నారు. అప్పటినుండి శృతి చాలా రోజులు బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. ఈ మధ్యనే ఆమె తిరిగి సినిమాలో నటిస్తుంది. రీసెంట్ గా ఆమె నటించిన క్రాక్ చిత్రం సూపర్ హిట్టు అయింది. రవి తేజ కు జోడీగా నటించింది. పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ అనే చిత్రాలోనూ నటించింది. మరల తన కెరీర్ లో రీ స్టార్ట్ చేసింది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లోనూ ఉంటుంది. ఇంస్టాగ్రామ్ వేధిక గా ఆమె అభిమానులతో లైవ్ లోకి వచ్చింది. ఈ సందర్భంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పింది. కెరీర్, పర్సనల్ విషయాలకు సంబందించిన ఎక్కువ ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో ట్రూ ఆర్ ఫాల్స్ సెక్షన్ నడించింది. ఓ అభిమాని మీరు మరల ప్రేమలో పడ్డార అని అడిగిన ప్రశ్నకు ట్రూ ఐ గేస్ అని సమాధానం ఇచ్చింది.
మళ్ళీ ప్రేమలో పడినట్లుగా హింట్ ఇచ్చింది. మరి ఇంతకు అతగాడు ఎవరా అని ఆమె అభిమానులు అరా తీస్తున్నారు. మరో అభిమాని మీరు మీ మాజీ బోయ్ ఫ్రెండ్ ని ద్వేషిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు స్మైల్ ఇచ్చి కాదు అని చెప్పింది. మరి ఆ కొత్త బోయ్ ఫ్రెండ్ ఎవరై ఉంటారు అనే విషయం శృతి కన్ఫర్మ్ చేసే వరకు వెయిట్ చెయ్యక తప్పదు.