కృష్ణ వంశీ చందమామ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్ అగర్వాల్, తమిళం, హింది,కన్నడ సినిమాల్లో నటిగా రానిస్తుంది. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్టు చిత్రాల్లో నటించిన కాజల్ ముంబై కి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకుంది. పెళ్లి కి ముందు వీరిద్దరు ఏడు ఎండ్లుగా డేట్ లో ఉన్నారు. ఆ తర్వాత ఒక్కరికొక్కరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట విదేశీ ట్రిప్ లతో తెగ ఎంజాయ్ చేస్తుంది.
కాజల్ పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేదా అనే విషయంపై ఆమె అభిమానుల్లో సందేహాలు ఉన్నాయి. కానీ ఆమె పెళ్లి తర్వాత తన సినీ కెరీర్ ను కూడా వదలను అంటుంది. తన భర్తను కూడా సినిమాల్లోకి తీసుకురావాలని చూస్తుంది. నటుడిగా కాదు. తన భర్త తో కలిసి ప్రొడక్షన్ హౌస్ ని నిర్మించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే కాజల్ తమిళ దర్శకుడు డికే తో ఓ సినిమాలో నటించనున్నది. ఈ చిత్రంలో ప్రభుదేవా హీరో గా నటించనున్నాడు.
రొమాంటిక్ కామిడీ గా ఈ చిత్రం రూపొందనున్నది. ప్రభు దేవ మరియు కాజల్ ల మధ్య ఘాటైన రొమాన్స్, లిప్ లాక్ సీన్స్ ఉంటాయని సమాచారం. మరి పెళ్లి తర్వాత కాజల్ రొమాన్స్ సినిమాలోనూ నటించడానికి వెనుక ఆడటం లేదు. పెళ్ళైన పర్వాలేదు కానీ సినిమాలు మాత్రం వదిలిపెట్టడం లేదు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే చిత్రంలో నటిస్తుంది. మంచు మోసగాళ్ళు చిత్రంలో ను హీరోయిన్ గా నటిస్తుంది. తమిళంలో శంకర్ డైరెక్షన్ లో ఇండియన్ చిత్రానికి సీక్వెల్ గా ఇండియన్ 2 లో కమల్ సరసన నటిస్తుంది.