అల్లరి నరేష్ సినిమాలు అంటే ఒకప్పుడు ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ మెంట్ ఉండేది. కాని ఇప్పుడు ఆయన సినిమాలు తగ్గాయి. కారణం ఆయన సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ లోపించడంతో జనాలు చూడ్డం మానేశారు. సుదీర్ఘ గ్యాప్ తర్వాత అల్లరోడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాపై అంచనాలు పెద్దగా ఏమీ లేవు. దాంతో కనీసం సక్సెస్ అయితే మంచి వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అనుకున్నారు. మరి సినిమా అనుకున్నట్లుగా ఉందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
ఒక బ్యాంక్ లో ప్రసాద్ (అల్లరి నరేష్) ఉద్యోగి. ప్రసాద్ ఉద్యోగం చేస్తూనే తన తాత చేసే బంగారం పనిని కూడా నేర్చుకుంటాడు. రెండు పనులు చేస్తూ సజావుగా జీవితం సాగిస్తున్న సమయంలో ప్రసాద్ వాళ్ల తాతకు అనారోగ్యం చేస్తుంది. ఆ సమయంలో ప్రసాద్ కు తాత ఒక సీక్రెట్ ను చెప్తాడు. దేవాలయంలో అమ్మవారికి ఉన్న నగలు బంగారంవి కావని, అవి డూప్లికేట్ నగలు అంటూ చెప్తాడు. ప్రసాద్ తల్లిదండ్రులు ఆరోగ్యం లేని సమయంలో అమ్మవారి నగలను ఉపయోగించినట్లుగా తాత చెప్తాడు. ఆ కారణంగానే మన ఫ్యామిలీకి ఏం కలిసి రావడం లేదని, నేను చనిపోయే వరకు ఆ బంగారంను అమ్మవారికి ఇవ్వాలని అనుకున్నాను అంటారు. తాత కోరికను ప్రసాద్ నెరవేర్చాడా, అసలు అంత బంగారంను ప్రసాద్ ఎలా తీసుకు వస్తాడు అనేది సినిమా కథ.
విశ్లేషణ :
అల్లరి నరేష్ ఇలాంటి పాత్రలు చాలానే చేశాడు. గతంలో మాదిరిగానే ఆకట్టుకున్నాడు. కాని ఇతర పాత్రలు మరియు స్క్రీన్ ప్లే విషయంలో నిరాశ పర్చాడు. మొత్తానికి సినిమా విడుదల విషయంలో ఉన్న అన్ని అడ్డంకులు తప్పించుకున్న బంగారు బుల్లోడు తన ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకులను అలరించడంలో మాత్రం విఫలం అయ్యాడు అనక తప్పదు. ఈ విషయం ప్రతి ఒక్కరికి నిరాశ పర్చతుంది. అల్లరి నరేష్ రేంజ్ కామెడీ లేదు. ఈ తరహా కథలు తెలుగులో ఎన్నో చూశాం. అల్లరోడి నుండి కొత్త తరహా కామెడీని ఆశిస్తున్నారు. కనుక పాత చింతకాయ పచ్చడి వంటి కథను ప్రేక్షకులు ఆధరించడం లేదు. ముందుగా అల్లరోడు ఇలాంటి కథలను ఎంపిక చేసుకోకుంటే బెటర్ అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వసూళ్ల విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఏమైనా వస్తాయా అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తుంటే బాక్సాఫీస్ వర్గాలు మాత్రం బ్రేక్ ఈవెన్ సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు. కలెక్షన్స్ విషయం పక్కన పెడితే సినిమా సో సో గానే ఉంది.
ప్లస్ పాయింట్స్ :
కామెడీ సీన్స్,
కొన్ని డైలాగ్స్,
అల్లరి నరేష్
మైనస్ పాయింట్స్ :
ఆశించిన స్థాయిలో ఎంటర్ టైన్‌మెంట్ లేదు,
కథ, స్క్రీన్‌ప్లే,
దర్శకత్వం,
ఎడిటింగ్.
చివరి మాట : ‘బంగారు బుల్లోడు’ నవ్వించలేక పోయాడు
రేటింగ్ : 2.0/5.0