అల వైకుంటపురంలో చిత్రం తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో కథ నడుస్తుంది. అల్లు అర్జున్ కి జోడీగా కన్నడ బ్యూటీ రష్మిక మందన నటిస్తుంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడిమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పా రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ 180 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అందులో సుకుమార్ వాటా 25 కోట్లు అల్లు అర్జున్ వాటా గా 40 కోట్లు గా తీసుకుంటున్నారు. హీరోయిన్, టెక్నీషియన్స్, మిగతా వర్కర్స్ అందరి రెమ్యూనరేషన్ కలిపితే 180 కోట్ల వరకు అవ్వుతుంది.
సుకుమార్ స్ర్కీప్ట్ విషయంలో చాలా పక్కగా ఉంటాడు. ఏవైనా మార్పులు చేర్పులు చేయవలసి వస్తే కచ్చితంగా వెనక ముందు ఆలోచించకుండా చేస్తాడు. కావున 180 కోట్ల బడ్జెట్ దాటొచ్చు అనే అభిప్రాయం ఉంది. పుష్పా కోసం భారీ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. 150 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యం ను పెట్టుకున్నాడు సుకుమార్. ఆ 150 రోజులకు బడ్జెట్ 180 కోట్లు వరకు అవ్వుతుంది. మరి బన్నీ కున్న క్రేజీ కి ఆ మాత్రం పెట్టాలిసి ఉంటుంది. తెలుగులోనే కాకుండా అల్లు అర్జున్ కు మలయాళం, తమిళ్ లో కూడా ఫుల్ ఫాలోయింగ్ ఉంది.
తాజా సమాచారం మేరకు ఈ చిత్రంను తమిళ్, కన్నడ, హింది, మలయాళం, కాకుండా వేరే బాషల్లో కూడా డబ్బ్ చేయాలని చిత్రా బృందం చూస్తుంది. విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తాడు అనే వార్తలు వస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో దేవి కుడా ఇది హ్యాట్రిక్ మూవీ అవ్వుతుంది. వచ్చే సంక్రాంతికి పుష్ప ను విడుదల చెయ్యనున్నారు.