బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ అనే చిత్రం రూపొందుతుంది. ఎన్‌టిఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, తమిళ నటుడు కమ్ దర్శకుడు సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఓలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీ లో ఆర్‌ఆర్‌ఆర్ కి సంబందించిన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎన్‌టిఆర్, రామ్ చరణ్ ల మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ప్రేక్షకుల ఒళ్ళు గగురు పొడిచే విదంగా ఉంటాయని చిత్రా బృందం భావిస్తుంది. పతాక సన్నివేశాల్లో ఎమోషనల్ ఏమాత్రం తగ్గకుండా దేశభక్తి ని ఎలివేట్ చేసే విదంగా క్లైమాక్స్ సన్నివేశాలను రాజమౌళి స్వయంగా దగ్గర గా ఉండి చూసుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
సినిమా ఆద్యంతం దేశభక్తి ని కూడా ఉంటుంది కావున పతాక సన్నివేశాల్లో ఆ మాత్రం గుస్ బంప్స్ సీన్స్ పెట్టారంట. ఈ షెడ్యూల్ తో ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ పూర్తి అవ్వుతుంది. త్వరలోనే విడుదలపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా రాబోతుంది. ఈ చిత్రం తర్వాత రాజమౌళి మహేశ్ తో ఓ సినిమా చెయ్యనున్నాడు. ఎన్‌టిఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీలో నటించనున్నాడు. చరణ్ తన తదుపరి సినిమా విషయంపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు కానీ ఫిల్మ్ నగర్ సర్కిల్ నుండి వస్తున్న వార్తల నేపథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్నాడు అంటున్నారు . ఈ విషయంపై చరణ్ క్లారిటీ ఇవ్వాలిసి ఉంది.