బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకునే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోడల్ గా కెరీర్ ను మొదలు పెట్టి సినిమాల్లోకి ప్రవేశించింది. హిందీలో ఎన్నోహిట్ట్ చిత్రాల్లో ఆమె నటించింది. సినిమ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు సహా నటుడు రణ్వీర్ సింగ్ ను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు బాలీవుడ్ పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. షారుఖాన్ తో పటాన్ అనే చిత్రంలో ఆమె నటిస్తుంది.
హృతిక్ రోషన్ తో ఫైటర్ మూవీలోనూ హీరోయిన్ గా ఆమె నటిస్తుంది. భర్త రణ్వీర్ సింగ్ తో 83 అనే చిత్రంలో నటిస్తుంది. కపిల్ దేవ్ బయో పిక్ ఆదారంగా ఈ చిత్రం రూపొందుతుంది. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయని సినివర్గాల నుండి అందుతున్న సమాచారం.
తాజాగా దీపిక ఓ ఇంటర్వ్యూ లో తన మ్యారేజ్ లైఫ్ ని. సినిమా లైఫ్ ని అందరితో షేర్ చేసుకుంది. ఈ నేపథ్యంలో మీరు రణ్వీర్ తో సినిమాల గురించి మీ ఇద్దరి మధ్య చర్చ వస్తుందాని ప్రశ్నించగా ఖచ్చితంగా వస్తుందని నా సినిమా గురించి రణ్వీర్. ఆయన సినిమాల గురించి నేను నిరంతరం చర్చించుకుంటం. ఏమైనా సందేహాలు ఉంటే రణ్వీర్ చాలా చక్కటి సలహాలు ఇస్తూ ఉంటాడు. చేయబోయే సినిమాలపై కూడా మేము డిస్కషన్ చేస్తూ ఉంటాం అన్నారు.
మేము ఇద్దరం కలిసి సినిమాల్లో నటించడం చాలా సంతోషం గా ఉంది అన్నారు. రణ్వీర్ సినిమా విషయానికి వస్తే ఇప్పటికే సూర్యవంశీ, 83 సినిమాలను పూర్తి చేశాడు. జయేష్ భాయ్ జోర్దార్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగులో దీపిక పదుకునె ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ సినిమా చెయ్యాలి. త్వరలోనే ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నది.