మాస్ మహారాజ్ రవి తేజ వరస ఫ్లాప్స్ తో వస్తున్న తరుణంలో ఆయన తన నమ్మకంను గోపిచంద్ మలినేని తో చేస్తున్న చిత్రంపైనే పెట్టాడు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి కి క్రాక్ చిత్రం రానే వచ్చింది. మొదటి రోజు ఆటతోనే ప్రేక్షకులనుండి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. రవి తేజకు క్రాక్ సూపర్ హిట్ విజయం ను గోపిచంద్ అందిచాడు. ఈ చిత్రంలో సముద్రఖని కట్టారి కృష్ణ పాత్రలో నటించి అందరిచే ప్రశంసలు అందుకున్నాడు.
శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ జయమ్మ పాత్రలో శభాస్ అనిపించుకుంది. ఈ రెండు పాత్రలు సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచాయి. ఇక మాస్ మహారాజ్ రవి తేజ పవర్ ఫుల్ పోలీసు పాత్రలో నటించాడు. ఈ చిత్రంను ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గా వేయించుకొని మరి చూసాడంట. ఈ చిత్రంను చూసిన వెంటనే గోపిచంద్ మలినేనికి ఫోన్ చేసి ప్రత్యేకంగ అభినందించాడు అంట.
కాలేజీ చదువుతున్న రోజుల్లో వేటపాలెం గ్యాంగ్ గురించి వినేవాన్ని. విధిలైట్లు అర్పెసి మర్డర్ చేసిన కన్సెప్ట్ చాలా బాగుంది అని అన్నారంట. ఈ విషయాలను గుర్తుచేసుకుంటూ చిరంజీవి బాల్యంలోకి వెళ్లిపోయారంట. వీలు కుదిరినప్పుడు గోపిచంద్ మలినేనిని ఆచార్య సెట్స్ కి రమ్మని చెప్పడంతో దర్శకుడు ఆచార్య సెట్ కు వెళ్ళి చిరంజీవి గారిని కలవడం జరిగింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
చిరంజీవిగారిని కలవడం చాలా సంతోషం గా ఉంది. కాసేపు ఇరువురు క్రాక్ సినిమా కథాంశం పై చర్చించినట్లుగా గోపిచంద్ ట్విటర్ ద్వారా తెలియజేశాడు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నాడు. గోపిచంద్ మాత్రం క్రాక్ విజయం ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన తదుపరి సినిమా విషయంపై ఎలాంటి ప్రకటన అయితే ప్రస్తుతానికి లేదు.