కరోనా కారణంగ పోస్ట్ అయిన చిత్రాలు ఇప్పుడిప్పుడే ఒక్కోటి గా విడుదల అవ్వుతు వస్తున్నాయి. ఈ సంక్రాంతి కి స్టార్ హీరోల సినిమాలు విడుదల కావలిసి ఉన్నది కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ చిత్రాలు విడుదల కాలేదు కేవలం తెలుగు నుండి మూడు చిత్రాలు రవి తేజ క్రాక్, రామ్ రెడ్ బెల్లం కొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలు మాత్రమే వచ్చాయి. ఇక తమిళం లో విజయ్ సేతుపతి నటించిన మాస్టర్ చిత్రం తెలుగులో డబ్బింగ్ మూవీ గా విడుదల అయ్యింది.
నిజానికి నితిన్ రంగ్ దే, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు విడుదల కావలిసింది కానీ ఆ చిత్రాలు సమ్మర్ కు పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే సమ్మర్ లో విడుదల చెయ్యడానికి చాలా పెద్ద ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి రాజమౌళి ఆర్ఆర్ఆర్, ప్రభాస్ రాధే శ్యామ్, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, కన్నడ హీరో యాష్ నటించిన కేజీయఫ్ 2 కూడా సమ్మర్ కు సిద్దం గా ఉంది. మరి ఈ పెద్ద సినిమాలను తట్టుకుని చిన్న చిత్రాలు భరిలో నిలవడం కష్టమే.
పవన్ కళ్యాణ్ పోలిటికల్ ఎంట్రీ తర్వాత ఆయన నటించిన చిత్రం వకీల్ సాబ్ కావున పవన్ ఫ్యాన్స్, ప్రేక్షకులు విపరీతంగా థియేటర్స్ కు ఎగబడే అవకాశం ఉంది. నాని నటించిన టక్ జగదీష్ ఏప్రిల్ 16 న విడుదల కాబోతుంది. నాగ చైతన్య లవ్ స్టోరీ కూడా సమ్మర్ లో రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఒక్కవెల పెద్ద సినిమాల విడుదల డేట్ లు గాని ప్రకటిస్తే చిన్న సినిమాలు మరోసారి పోస్ట్ అవ్వక తప్పదని తెలుస్తుంది. ఒక్కవేల పెద్ద సినిమాలకు పోటీగా చిన్న చిత్రాలు సమ్మర్ లో విడుదల అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రసవత్తర పోరు నడుస్తది. ప్రేక్షకులకు, అభిమానులకు ఈ సమ్మర్ లో సినిమాలు సందడే సందడి చెయ్యనున్నాయి.