ఈవివి సత్యనారాయణ కొడుకుగా అల్లరి చిత్రంతో సినిమాలోకి అడుగు పెట్టిన నరేష్.. సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకుని అల్లరి నరేష్ గా నవ్వుల పువ్వులు పుయిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ సినిమాలకు అడ్రెస్ గా మారిపోయాడు. వరస హిట్స్ తో దూసుకుపోయిన అల్లరి నరేష్ కెరీర్ మధ్యలో వరస ఫ్లాప్స్ కూడా ఎదురైనాయి. ఈ నేపథ్యంలో ఆయన పెద్ద హీరోల సినిమాలో కీలక పాత్రలు చేస్తూ వచ్చాడు.
మరో వైపు సోలోగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. లాక్ డౌన్ కు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్నా బంగారు బుల్లోడు. నేడు ఈ చిత్రం నుండి ట్రైలర్ ను విడుదల చేశారు. పి.గిరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ కి జోడీగా పూజ జవేరి హీరోయిన్ గా నటించింది. రోమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అల్లరి నరేష్ బంగారు బుల్లోడు ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ ను ఓసారి గమనించినట్లు అయితే గ్రామీణ ప్రాంతంలో ఉండే బ్యాంక్ చుట్టూ కథ నడుస్తుంది. ఆ బ్యాంక్ లో అల్లరి నరేష్ వర్క్ చేస్తూ ఉంటాడు.
పోసాని కృష్ణ మురళి బొట్టు నాగరాజు పాత్రలో నటించాడు. ఆయన ఈ బ్యాంక్ లో అయిదు ఏండ్ల కిందట 80 సవర్ల బంగారం తాకట్టు పెట్టి బయట 5 రూపాయల వడ్డీకి రుణాలు ఇస్తూ ఉంటాడు. ఆ 80 సవర్ల బంగారం బ్యాంక్ నుండి మాయం అవ్వుతుంది. ఈ నేపథ్యంలో బంగారం ఎవరు మాయం చేశారు అనే అంశం పై కథ నడుస్తుంది. దొంగను పట్టుకునే క్రమంలో జరిగే కామెడిని ప్రధానంగా చేసుకొని చూపించాడు. వెన్నల కిశోర్ మరో కామిడీ పాత్రలో నటించాడు. ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ మహేశ్, భద్రం, సత్యం రాజేశ్ లు నటించారు. జనవరి 23న బంగారు బుల్లోడు ప్రేక్షకుల ముందుకు రానున్నది.