కరోనా కారణంగ సినిమా థియేటర్లకు తాళం వెయ్యడంతో చాలా వరకు సినిమాలు ఆగిపోయాయి. కాస్త కరోనా తగ్గుముఖం పట్టడంతో థియేటర్స్ కు పర్మిషన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పెండిగ్ లో ఉన్న సినిమాలు వరస పెట్టి విడిదల అవ్వుతు వస్తున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం మాస్టర్ తెలుగు, తమిళం బాషల్లో ఈ చిత్రం విడుదల అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగ 1000 స్క్రిన్స్ పైనే మాస్టర్ సినిమా విడుదల అయింది.
ఈ చిత్రానికి రెండు రాష్ట్రాల్లో డివైడ్ టాక్ ను దక్కించుకున్న ఈ చిత్రంకు కలెక్షన్స్ మాత్రం తగ్గడంలేదు. వారం రోజుల్లో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. కరోనా నిబందనల మేర 50 శాతం మాత్రమే సిటింగ్ కు పర్మిషన్ ఉంది. అయిన ప్రేక్షకులు మాత్రం మాస్టర్ చిత్రానికి క్యూ కడుతున్నారు. దీనికి మరో కారణం కూడా ఉన్నది. థియేటర్స్ కి ఇప్పుడిప్పుడే పర్మిషన్స్ ఇస్తుండటం పెద్ద హీరోల సినిమాలు ఏవి విడుదలకు సిద్దంగా లేకపోవడం ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చింది.
తెలుగులో మాస్టర్ చిత్రానికి వారం రోజుల్లో 10 కోట్లు వసూళ్లు చేసింది. రవి తేజ క్రాక్, రామ్ రెడ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ చిత్రాలు సంక్రాంతి భరిలో ఉన్నప్పటికి మాస్టర్ కి మాత్రం కలెక్షన్స్ తగ్గడం లేదు. మాస్టర్ వసూళ్లను చూసి విజయ్ ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటున్నారు. ఇక ఈ వీకెండ్ లో మాస్టర్ రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టిందని చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం.
విజయ్ మాస్టర్ తర్వాత తన తదుపరి చిత్రాన్ని మురగదాస్ దర్శకత్వంలో చెయ్యనున్నాడని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. లోకేష్ కనగరాజ్ తన తదుపరి సినిమాను కమల్ హాసన్ తో విక్రమ్ అనే చిత్రంను చెయ్యనున్నడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.