సినిమా ప్రపంచంలోకి రావాలంటే చాలా కష్టపడాలి. ఒక్కసారి ఛాన్స్ వచ్చిందంటే లైఫే మారిపోతుంది. అల వచ్చిన వారు ఎందరో ఇప్పుడు అగ్రహీరోలుగా, స్టార్ కమెడియన్స్ గా రానిస్తున్నారు. ఒక్కో జనరేషన్ లో ఒక్కో బ్యాచ్ హీరో లుగాని, కమెడియన్ లుగాని ఉంటారు. అల వారందరు తాము పడ్డ కష్టాలను, తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఓ గేటు టూ గేదర్ ను సంవత్సరంలో ఓసారి ఏర్పాటు చేసుకుంటు ఉంటారు.
1980’s అని చిరంజీవి అండ్ బ్యాచ్ ప్రతి ఇయర్ ఒక్కరు చొప్పున ఈ గెట్ టూ గెధర్ ను ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఉన్న మన టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ కూడా అందరు ఒక్కదగ్గరచెరి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఇయర్ లాగే వారు ఈ సంవత్సరం ఒక్కదగ్గర చేరారు. మొత్తం 11 మంది కమెడియన్స్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ తన ఇంస్టా గ్రామ్ లో ఫోటో షేర్ చేస్తూ… అందరం ఒక్కదగ్గర చెరి వన్ ఇయర్ అవ్వుతుంది.
ఫుల్ హ్యాపీ అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది. నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందరు ఒక్కదగ్గర చేరడం సంతోషం గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం పరమానందయ్య శిష్యులు సినిమా మరోసారి తీస్తే బాగుంటుంది అంటున్నారు. ఈ 11 మందిలో జబర్దస్త్ కామెడియన్స్ కూడా ఉన్నారు. తాగుబోతు రమేష్, వేణు, ధన్ రాజు, ముక్కు అవినాష్ లు ఉన్నారు వీరు జబర్దస్త్ ద్వారా సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్నారు. మిగతవాళ్లు మాత్రం డైరెక్ట్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల ద్వారా స్టార్ కమెడియన్ గా ఎదిగారు.