మాస్ మహారాజ్ రవి తేజ కు ఈ ఏడాది క్రాక్ చిత్రం తో మంచి విజయం ను అందించిన దర్శకుడు గోపిచంద్ మలినేని. పవర్ ఫుల్ పోలీసు పాత్రలో మాస్ డైలాగ్స్ తో. మాస్ సాంగ్స్ తో ప్రేక్షకులను కట్టి పడేశాడు. మాస్ సినిమాలు ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని విపరీతంగా అదరిస్తున్నారు. గోపి చంద్ మలినేని రవి తేజకు ఈ చిత్రంతో కలిపి మూడు విజయాలను అందించాడు. క్రాక్ చిత్రం వసూళ్ల పరంగ దూసుకుపోతుంది.
మాస్ చిత్రాలను తియ్యడంలో ఈ దర్శకుడు దిట్ట. మాస్ ప్రేక్షల నాడిని కరెక్ట్ గా పట్టుకున్నాడు. మాస్ ఫాలోయింగ్ ఉన్న యువ హీరోలు ఈ దర్శకుడి వెంట పడుతున్నారంట. ఈ లిస్ట్ లోకి రామ్ పోతినేని, సాయి ధరమ్ తేజ్, బెల్లం కొండ సాయి శ్రీనివాస్ లు చేరినట్లుగా సమాచారం. ఇంతకు ముందు రామ్ తో పాండా చేసుకో అనే చిత్రంను తీశాడు. ఈ చిత్రం మంచి విజయంనే సాదించింది. సాయి తో విన్నర్ అనే చిత్రం ను తీశాడు.
ఈ ఇద్దరు హీరోలు కూడా ఈయన దర్శకత్వంలో నటించినవారే కొత్తగా వచ్చి చేరింది బెల్లం కొండ సాయి శ్రీనివాస్. ఈ ముగ్గురు యువ హీరోల తో చేస్తాడా లేక మరో హీరోను ఎంచుకుంటాడ అనే విషయం తెలియలిసి ఉన్నది. గోపి చంద్ మలినేని సినిమాల విషయానికి వస్తే సంగం హిట్స్ సగం ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ దర్శకుడిగా మంచి ట్యాలెంట్ ఉన్న వ్యక్తి. అందుకే ఈ దర్శకుడికి వరస ఫ్లాప్స్ ఉన్న మంచి సినిమాతో హిట్ట్ ఇవ్వగలడని హీరోల్లో గట్టి నమ్మకం. మొదటి నుండి మాస్ చిత్రాలను నమ్ముకున్న ఈ దర్శకుడు క్రాక్ చిత్రంతో మాస్ చిత్రాలు ఇలా కూడా తీయొచ్చని కొత్తగా చెబుతున్నాడు.