శ్రీను వైట్ల వరస హిట్స్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈయన చిత్రంలో ప్రధానం అయినది కామిడీ. శ్రీను వైట్ల సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనేవారు. ఎందుకు అంటే కామిడీ తో సగం సినిమాను లాగేస్తాడు. ఇప్పుడు అదే కామిడీ ఆయనకు శాపం గా మారింది. చేసిన కామిడినే మరల చేస్తే ప్రేక్షకులకు విసుగు వచ్చేసింది.
ఆయన నుండి ఈ మధ్యకాలం లో వచ్చిన సినిమాలు మొత్తం ఫ్లాప్స్ గా మిగిలాయి శ్రీను వైట్లతో సినిమా అంటేనే హీరో లు, ప్రేక్షకులు భయపడుతున్నారు. ఫ్లాప్ డైరెక్టర్ లిస్ట్ లోకి శ్రీను వైట్ల చేరిపోయాడు. చేతిలో సినిమాలు లేక ఒంటరిగా మిగిలిపోయాడు. సంక్రాంతి భరిలో ఏదో ఓ సినిమాను నిలిపే శ్రీను వైట్ల ఈ సంక్రాంతి ఎలాంటి సందడి లేదు. మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన డీ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.
ఆ చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. శంకరన్న పాత్రలో శ్రీ హరి మెప్పించాడు. ఆద్యంతం నవ్వులు పుయిస్తూ మంచి రొమాంటిక్ కామిడీ ఎంటర్టైనర్ గా ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచనలో మంచు విష్ణు ఉన్నాడు. ఆ మధ్య ఆయన బర్త్ డే రోజున డీ సీక్వెల్ ఉండబోతుందని అనౌన్స్ మెంట్ ఇచ్చాడు డి అండ్ డి అనే టైటిల్ ను ఖరారు చేశాడు. ఈ సినిమాకి కథను గోపి మోహన్ అందించాడు.
మహాతి స్వరసాగర్ సంగీతం అందించనున్నాడు. మంచు విష్ణు, శ్రీను వైట్ల నుండి ఈ చిత్రం గురించి సంక్రాంతి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అనుకున్నారు కానీ ఎలాంటి అప్డేట్ ను ఇవ్వలేదు. ప్రస్తుతం విష్ణు మోసగాళ్ళు అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. తెలుగు,తమిళ, హింది, కన్నడ, బాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. కావున ఈ చిత్రం పూర్తి అయిన తర్వాతే డి అండ్ డి గురించి విష్ణు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది.