బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయకిగా నటిస్తుంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ, అల్లు అరవింద్ లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అక్కినేని అఖిల్ ఈ చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యనున్నాడు.
వీరి కాంబినేషన్ లో సినిమా ప్రకటించి కూడా కొన్ని నెలలు అవ్వుతుంది. కానీ ఇంతవరకు ఈ చిత్రం నుండి ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు. అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పూర్తి అయిన వెంటనే సురేందర్ రెడ్డి తో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఇప్పటికే దర్శకుడు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి సిద్దంగా ఉన్నాడు. అఖిల్ తో సినిమా కోసం మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ను, తమిళ నటుడు అరవింద్ స్వామి ని రంగంలోకి దింపుతున్నట్లుగా సమాచారం.
దృవ చిత్రం చేస్తున్న సమయంలో అరవింద్ స్వామి తో సురేందర్ రెడ్డి కి మంచి పరిచయం ఉంది. ఆ చనువుతో అరవింద్ స్వామి ని కలిసి అఖిల్ తో సినిమా కోసం సంప్రదించినట్లుగా సమాచారం. ఆయన నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. టాలీవుడ్ సినిమాలపై మోహన్ లాల్ కు ప్రత్యేకమైన అభిమానం. ఆయన తెలుగులో నటించిన చిత్రాలు మంచి విజయం సాదించాయి. ఆయన మలయాళ చిత్రాలు తెలుగులో డబ్బ్ చేసిన చిత్రాలు మంచి విజయం సాదించాయి.
సురేందర్ రెడ్డి, మోహన్ లాల్ గారిని కలిసి స్క్రిప్ట్ డిస్కషన్ జరిపినట్లుగా సమాచారం. అఖిల్ 5 లో ఆయన నటించేందుకు ఒకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మోహన్ లాల్, అరవింద స్వామి లు ఇద్దరు అఖిల్ 5 లో నటించడం ఖాయం అని తెలుస్తుంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి.