విజయ్ సేతుపతి తమిళ్ సినిమా ఇండస్ష్ట్రి కి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన నటనతో అక్కడి ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు. హీరోగా విలన్ గా రానిస్తూ వస్తున్నాడు. తమిళ్ తో పాటుగా తెలుగు,మలయాళం సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన మాస్టర్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఈ నేపథ్యంలో ఆయన పుట్టిన రోజు నాడు క్షమాపణలు చెప్పాడు. పుట్టిన రోజును ఎవరైనా గ్రాండ్ గా సెలబ్రేట్ చేకుంటారు కానీ ఇలా క్షమాపణలు చెప్పడం ఏమిటి అనుకుంటున్నారా. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన కేక్ ను ఖడ్గం తో కట్ చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో పెద్ద వివాదం అయింది.
గతంలో కొంతమంది ఇలానే చేస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాంటివి ప్రముఖుల విషయంలో ఉండవా అంటూ నెటిజన్స్ ట్రోల్ల్స్ చెయ్యడం మొదలు పెట్టారు. ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ… ప్రస్తుతం నేను పోన్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ఆ చిత్రంలో కత్తి ప్రధానా పాత్ర పోషిస్తుంది. కావున ఆ చిత్రా యూనిట్ ఖడ్గంతో కేక్ ను కట్ చేయ్యించారు. ఈ సందర్భంగా ఎవరి మనసుకైనా బాద కలిగితే క్షమించండి. ఇలాంటివి మరల జరగకుండా చూసుకుంటాను అంటూ ట్వీట్ చేశాడు. అంతటితో ఆ వివాదం కు ఫుల్ స్టాప్ పెట్టాడు. తెలుగులో ఆయన ఉప్పెన చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.