అల్లు అరవింద్ ఆద్వర్యంలో కొనసాగుతున్న ఆహా ఓటీటీ చిన్న సినిమాలను, చిన్న చిన్న వెబ్ సిరీస్ ను మాత్రమే నిర్మిస్తు వస్తుంది. ఇక నుండి చిన్న సినిమాల కొనుగోలు విషయంను పక్కన పెట్టి కోటికి పైగా అటు ఇటూగా ఉన్న సినిమాలను కొనుగోలు చెయ్యాలని చూస్తుంది. ఇప్పటికే పలు మలయాళ డబ్బింగ్ సినిమాలో ఆహాలో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వుతున్నాయి. ప్రేక్షకులు సైతం ఇప్పుడిప్పుడే ఆహా బాటా పడుతున్నారు.
మొదటి నుండి ఆహా కు అమెజాన్, జీ 5 వంటి ఓటీటీలు పోటీగా వస్తున్నాయి. పెద్ద పెద్ద సినిమాలను ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ దక్కించుకుంటున్నాయి. లాక్ డౌన్ సమయంలో అమెజాన్ ప్రైమ్ ద్వారా భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల అయ్యాయి. ఆహా కూడా ఇప్పుడు అదే బాటలో అడుగులు వేస్తుంది. అల్లు అరవింద్ అందుకు ప్లాన్ సిద్దం చేస్తున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవి తేజ హీరోగా వచ్చిన చిత్రం క్రాక్. ఈ చిత్ర నిర్మాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి సినిమాను విడుదల చేయలేకపోయాడు. ఆ సమయంలో నిర్మాత అల్లు అరవింద్ క్రాక్ ఓటీటీ రైట్స్ కొనుగోలు చేశాడు.
ఆ వచ్చిన డబ్బుతో ఠాగూర్ మధుకి క్రాక్ చిత్రం యొక్క క్లియరెన్స్ సర్టిఫికేట్ లభించింది. ఈ చిత్రం త్వరలో ఆహా లో విడుదల అవ్వుతుంది. ఈ నేపథ్యంలో శేకర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం యొక్క డిజిటల్ ఫ్లాట్ ఫామ్ రైట్స్ ను ఆహా దక్కించుకుంది. ఈ చిత్రం కూడా ఆహా లో విడుదల కానున్నది. మంచి కన్సెప్ట్ ఉన్న చిన్న సినిమాలతో పాటుగా పెద్ద సినిమాలను కొనుగోలు చెయ్యాలనే పనిలో అల్లు అరవింద్ ఉన్నాడు. ఇకపై తెలుగు కొత్త చిత్రాల విషయంలో ఆహా ఓటీటీ నుండి అమెజాన్ ప్రైమ్ కి, జీ 5 కి గట్టిపోటీ ఎదురుకానున్నది.