ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన రెడ్ మూవీ సంక్రాంతి కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా కోసం రామ్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాక్ డౌన్ సమయంలో సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ ప్రచారం జరిగింది. అలా జరిగినా బాగుండు అంటూ రామ్ అభిమానులు మనసులో అనుకునే మాదిరిగా రెడ్ ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అన్ని విధాలుగా రెడ్ సినిమా నిరాశ పర్చింది.
రామ్ ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ అంటూ ట్యాగ్ ను కలిగి ఉన్నాడు. ఆ రేంజ్ లో ఆయన నటన ఉంది. కాని కథ మరియు కథనంలో మాత్రం ఎనర్జి లేదు. మొదటి సారి రామ్ డబుల్ రోల్ లో కనిపించిన నేపథ్యంలో అభిమానులు చాలా ఉత్సాహం కనబర్చారు. కాని సినిమా విషయంలో మాత్రం విడుదల అయిన తర్వాత వారు అంతా కూడా నిరాశ పర్చారు. ఏమాత్రం ఆకట్టుకోలేని కథ మరియు కథనం విషయంలో ప్రేక్షకులను దర్శకుడు మెప్పించలేక పోయాడు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా లేదు అనడంలో సందేహం లేదు.
రామ్ తో నటించిన హీరోయిన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాకు రివ్యూవర్స్ యావరేజ్ గా 2.25/5 రేటింగ్ ఇచ్చారు. ఈ రేటింగ్ తో సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది అన్నట్లుగా భావించవచ్చు. రామ్ అభిమానులు ఒక సారి చూడవచ్చు అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇక ఇతర సినీ ప్రేక్షకులు మాత్రం అంతగా రిస్క్ తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ రివ్యూవర్స్ కామెంట్ చేస్తున్నారు. రామ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనుకుంటే ఇలా నిరాశ పర్చడం యూనిట్ సభ్యులకు అభిమానులకు కూడా ఒకింత బాధగా ఉంది.