బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా అను ఎమాన్యూల్ కీలక పాత్రలో నటించిన అల్లుడు అదుర్స్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. అల్లుడు శీను కాస్త అల్లుడు అదుర్స్ అవ్వడంతో అంతా కూడా చాలా ఆసక్తిని కనబర్చి ఈ సినిమాను చూసేందుకు ఉత్సాహం చూపించారు.
సినిమా ఫలితం ఎలా ఉంది అనేది ప్రేక్షకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయగా వారు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మళ్లీ ఒక రొటీన్ ఎంటర్ టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు. ఏ మాత్రం ఆకట్టుకోలేని కథ కథనంను దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ నడిపించి మెప్పించడంలో విఫలం అయ్యాడు అంటూ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అల్లుడు అదుర్స్ సినిమాలో కొన్ని ఎంటర్టైన్ మెంట్ సీన్స్ మినహా మరేం పెద్దగా లేవు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ను కూడా బెల్లంకొండ కోసం కాస్త ఎక్కువ ఖర్చు పెట్టి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో తీయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు పెద్ద ఎత్తున వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమా అంచనాలు అన్ని కూడా ఈ సినిమా అందుకోవడంలో విఫలం అయ్యింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అన్ని వర్గాల వారిని ఈ సినిమా ఆకట్టుకోవడం సాధ్యం కాదు.
ఎందుకంటే ఇందులో శృతి మించిన హర్రర్ ఆకట్టుకోలేక పోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే ఎంటర్ టైన్ మెంట్ తగ్గింది. కథ ను గందరగోళంగా చూపించారు. మొత్తానికి ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. అల్లుడు అదుర్స్ సినిమాలో నభా నటేష్ మరియు ప్రకాష్ రాజ్ లతో పాటు సోనూసూద్ లు కూడా సో సో గానే కనిపించారు. కొన్ని సీన్స్ లో సోనూ సూద్ కామెడీ టచ్ ఆకట్టుకుంది. ఇక అంతకు మించి ఏమీ లేదు.