నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో సింహ , లెజెండ్ చిత్రాలు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించి అభిమానులను ఆనందపరిచాయి. దీంతో మరోసారి వీరిద్దరి కాంబో సినిమా అనగానే అందరిలో అంచనాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తాలూకా ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ఖర్చు అమాంతం పెరిగిపోతుందని టాక్. ప్రస్తుత కరోనా నేపథ్యంలో బోయపాటి అస్సలు తగ్గడం లేదట. ఇప్పటికే పది రోజుల ఫైట్ షూట్ కోసం ఏకంగా రెండున్నర కోట్లు ఖర్చయినట్లు సమాచారం. అంతేగాక సినిమాలో మెయిన్ విలన్ గా సోనూసూద్ అనుకుంటే.. ఆయన ఐదు కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. అందుకని బడ్జెట్ అంచనాలు దాటిపోతుందని నిర్మాత.. బాలయ్య బోయపాటిలను కన్విన్స్ చేసే పనిలో పడ్డారని ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.