తెలుగులో అగ్ర హీరోల సరసన నటించిన రకుల్ ప్రీతీ సింగ్..ప్రస్తుతం అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఈ క్రమంలోనే తన తమ్ముడు అమన్‌ను హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘తెర వెనుక’ అనే చిత్రం ద్వారా అమన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న అమన్ ..తన అక్క ఛాన్స్ ల విషయంలో తన మనసులోని కోరికను బయటపెట్టాడు. సినిమా ఇండస్ట్రీలో తనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని అన్నారు అమన్. అక్క రకుల్‌కు అయితే మంచు లక్ష్మి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. తనకు లక్ష్మి, మనోజ్ ఇండస్ట్రీలో బాగా క్లోజ్ అని వెల్లడించారు. ఇక హీరోలతో రకుల్ ఫ్రెండ్షిప్ గురించి తనకు తెలీదని అన్నారు. ఇక ‘సరైనోడు’, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాల్లో రకుల్ నటన తనకు చాలా ఇష్టమని అమన్ చెప్పారు. ముఖ్యంగా ‘సరైనోడు’లో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే సన్నివేశాల్లో రకుల్ నటన అద్భుతమన్నారు. అయితే, తన అక్కను ప్రభాస్ పక్కన చూడాలని ఉందని అమన్ మనసులో కోరిక బయటపెట్టారు.