మెగా అభిమానులకు మరో చేదు వార్త.. మంగళవారం ఉదయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా సోకినా విషయం తెలిసి షాక్ అవ్వగా..ఇప్పుడు మరో మెగా హీరో కరోనా బారినపడ్డారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపారు.
చరణ్ కు పాజిటివ్ వచ్చినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేవని.. కానీ తనకు స్వల్పంగా లక్షణాలు ఉన్నాయని అలాగే ప్రస్తుతం క్వారంటైన్ లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాని వరుణ్ తేజ్ తెలిపాడు. తాను కరోనాను జయించి తిరిగి వస్తానని అధికారిక ప్రకటన చేసాడు.
కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవికి కూడా కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ని రోజులైనా తనకు లక్షణాలు కనిపించకపోవడంతో చిరంజీవి మరో మూడు చోట్ల టెస్టులు చేయించుకోగా అన్నిచోట్లా కరోనా నెగిటివ్ అని ఫలితం వచ్చింది. అలాగే మెగా బ్రదర్ నాగబాబు సైతం కరోనా బారిన పడి క్షేమంగా బయటపడ్డారు.
pic.twitter.com/V7OHOsoQa5— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 29, 2020