మెగా ఫ్యామిలీ మరో హీరో కరోనా బారిన పడ్డారు. కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవికి కూడా కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ని రోజులైనా తనకు లక్షణాలు కనిపించకపోవడంతో చిరంజీవి మరో మూడు చోట్ల టెస్టులు చేయించుకోగా అన్నిచోట్లా కరోనా నెగిటివ్ అని ఫలితం వచ్చింది. అలాగే మెగా బ్రదర్ నాగబాబు సైతం కరోనా బారిన పడగా..ఇప్పుడు చరణ్ కూడా వారి జాబితా లో చేరాడు. తనకు కరోనా సోకినా విషయాన్నీ మంగళవారం ఉదయం చరణ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
‘నాకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. కానీ ఎలాంటి లక్షణాలు లేవు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నాను. త్వరలోనే కోలుకుని బలంగా తిరిగి వస్తాను’ అంటూ రామ్చరణ్ ట్వీట్ చేశారు. కొద్దిరోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని రామ్చరణ్ రిక్వెస్ట్ చేశారు. తన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం వెల్లడిస్తానన్నారు. ప్రస్తుతం చరణ్ ..ఆర్ఆర్ఆర్ తో పాటు ఆచార్య మూవీ లో నటిస్తున్నారు. మరి ఇప్పుడు చరణ్ కు కరోనా సోకడం తో కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం కావాల్సింది. దీంతో ఆ రెండు చిత్ర షూటింగ్ లకు ఇబ్బంది గా మారనుందా..అనేది చూడాలి.