వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన రకుల్ ప్రీతీ సింగ్..మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల ఛాన్సులు రావడం తో అతి తక్కువ టైంలోనే టాప్ ప్లేస్ కు చేరుకుంది. కానీ ఎంత త్వరగా టాప్ కు వెళ్లిందో అంతే త్వరగా డౌన్ కు చేరుకుంది. ఈ మధ్య డ్రగ్స్ వ్యవహారం లో చిక్కుకొని వివాదాస్పదంగా మారింది. ఇక రీసెంట్ గా కరోనా నుండి బయటపడ్డ ఈమె..ప్రస్తుతం వరుస సినిమాలపై ఫోకస్ పెట్టింది. తెలుగు, తమిళ, హిందీ భాషల సినిమాల్లో నటిస్తుందట. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఏడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది.
తెలుగులో క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమాతోపాటు, నితిన్ చెక్
లో కూడా ఛాన్స్ దక్కించుకుంది. అలాగే హిందీలో అర్జున్ కపూర్‌తో సర్దార్ అండ్ గ్రాండ్ సన్
, జన్ అబ్రహంతో ఎటాక్
, అజయ్ దేవ్‌గణ్ మే డే
సినిమాల్లో నటిస్తోంది. ఇక, తమిళంలో హీరో శివకార్తికేయన్ సరసన అయలన్
సినిమా కూడా చేస్తోంది. ఇలా వరుస సినిమాలతో రకుల్ బిజీబిజీగా ఉంది.