సుకుమార్ – అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో దేవి శ్రీ సంగీత సారథ్యంలో రష్మిక హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలె తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మొదలైంది. కాగా చిత్ర యూనిట్ లో కొంతమందికి కరోనా లక్షణాలు కనిపించడం తో పాటు ఓ వ్యక్తి మరణించడం తో వెంటనే చిత్ర యూనిట్ షూటింగ్ ను రద్దు చేసి హైదరాబాద్ కు తిరిగివచ్చింది. ప్రస్తుతం కొత్త షెడ్యూల్ లో అరకు లో మొదలుపెట్టబోతున్నారు.
కొన్ని ఛేజింగ్ సీన్స్ ను చిత్రీకరించడం కోసం అరకు వెళ్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. రెడ్ శాండిల్ ను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాకు పోలీసులకు మద్య జరిగే ఛేజింగ్ సీన్ లను అరకులో అయితే చాలా ఎఫెక్టివ్ గా చిత్రీకరించే వీలు ఉంటుందని దర్శకుడు సుకుమార్ అక్కడకు వెళ్లే ప్లాన్ చేశాడని అంటున్నారు. ఈ షెడ్యూల్ లో రష్మిక జాయిన్ అవుతుందట. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.