సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యం తో జూబ్లీ హిల్స్ అపోలో హాస్పటల్ లో చేరడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. పది రోజుల క్రితం రజనీకాంత్ తన కొత్త చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చారు. కాగా చిత్ర యూనిట్ లో 8 మందికి కరోనా సోకడం తో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. రజిని సైతం కరోనా టెస్ట్ చేసుకోగా ఆయనకు నెగిటివ్ వచ్చింది.
ఈ క్రమంలో శుక్రవారం హైబీపీతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో రజనీకాంత్ చేరారు. రెండు రోజుల పాటు చికిత్స అవసరమని డాక్టర్లు సూచించినప్పటికీ అభిమానుల్లో , సినీ ప్రముఖుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సడెన్ గా ఆలా ఎందుకు జరిగిందని కొంతమంది మాట్లాడుకుంటుంటే..సోషల్ మీడియా లో ఆయన లో కరోనా లక్షణాలు కనిపించడం తో హాస్పటల్ లో చేరినట్లు ప్రచారం మొదలు కావడం తో ఇంకాస్త ఆందోళన పడుతూ హాస్పటల్ వద్దకు భారీగా చేరుతున్నారు. ప్రస్తుతం డాక్టర్స్ లోనికి ఎవర్ని అనుమతించడం లేదు.